ఇండియాలో భారీగా తగ్గిన చైనా దిగుమతులు: గణాంకాలు ఏం చెబుతున్నాయంటే?

14 Apr, 2023 08:15 IST|Sakshi

న్యూఢిల్లీ: భారత్‌ దిగుమతుల్లో చైనా వాటా తగ్గుతోంది. వాణిజ్య మంత్రిత్వశాఖ తాజాగా విడుదల చేసిన గణాంకాల ప్రకారం 2021 - 22లో భారత్‌ మొత్తం దిగుమతుల్లో చైనా వాటా 15.43 శాతం. ఇది 2022 - 23లో 13.78 శాతానికి తగ్గింది. అయితే విలువల్లో మాత్రం ఈ పరిమాణం ఇదే కాలంలో 94.57 బిలియన్‌ డాలర్ల నుంచి 98.51 బిలియన్‌ డాలర్లకు చేరింది. 

గడచిన రెండు ఆర్థిక సంవత్సరాల్లో చైనాకు భారత్‌ ఎగుమతులు కూడా 21.26 బిలియన్‌ డాలర్ల నుంచి 15.32 బిలియన్‌ డాలర్లకు తగ్గాయి. రష్యా (369 శాతం), ఇండోనేషియా (63 శాతం), సౌదీ అరేబియా (23 శాతం), సింగపూర్‌ (24 శాతం) కొరియా (21 శాతం)లకు భారత్‌ ఎగుమతులు పెరిగాయి. 

మరిన్ని వార్తలు