electric car: ప్రపంచంలోనే అత్యంత చవకైన ఎలక్ట్రిక్‌ కార్‌, ధర ఎంతంటే..?

2 Oct, 2021 14:43 IST|Sakshi

త్వరలోనే 'నానో' కారు ఇన్స్పిరేషన్‌తో ప్రపచంలోనే అత్యంత చవకైన ఎలక్ట్రిక్‌ కారు విడుదల కానుంది. దీని ధర ఆల్టో కారు కంటే తక్కువగా ఉంటుందని ఆటోమొబైల్‌ ప్రతినిధులు చెబుతున్నారు. 

చైనా ఎలక్ట్రిక్‌ కార్ల తయారీ సంస్థ వుల్లింగ్ హాంగ్ గ్వాంగ్ (Wuling Hongguang) గతేడాది మిని ఎలక్ట్రిక్‌ కారును విడుదల చేసింది. విడుదలైన ఈ కారు వినియోగదారుల్ని ఆకట్టుకోవడంతో రికార్డ్‌ స్థాయిలో 119,255 యూనిట్ల అమ్మకాలు జరిగాయి. అదే జోరుతో మనదేశానికి చెందిన నానో కారు ఇన్స్పిరేషన్‌తో వుల్లింగ్‌ సంస్థ 'వుల్లింగ్ నానో' పేరుతో 'ఈవీ' కారును తయారు చేసింది. ఆల్టో కారు ధర 3 లక్షలు ఉండగా.. అర్బన్‌ ప్రాంతాల్లో వినియోగించేలా కేవలం 2 సీట్ల సామర్ధ్యంతో డిజైన్‌ చేసిన కారు ధర రూ.2లక్షల 30వేలని ఆటోమొబైల్‌ సంస్థ వుల్లింగ్‌ తెలిపింది.   

ఫీచర్లు 
చైనా నానో ఈవీ కారు 2,497 ఎంఎం లెంగ్త్‌,1526 ఎంఎం విడ్త్‌, 1616 ఎంఎం ఎత్తు, వీల్‌ బేస్‌ 1600 ఎంఎంగా ఉంది. నానో ఈవీ 28 kWh సామర్థ్యంతో IP67- సర్టిఫైడ్ లిథియం అయాన్ బ్యాటరీని అందిస్తుంది. అంత్యంత చవకైన ఎలక్ట్రిక్ కారును ఒక్కసారి ఛార్జ్ చేస్తే 305 కిమీ ప్రయాణించవచ్చని తయారి దారులు చెబుతున్నారు. సాధారణ 220 వోల్ట్ దేశీయ సాకెట్‌తో బ్యాటరీని రీఛార్జ్ చేసేందుకు 13.5 గంటలు పడుతుండగా..6.6 కేడబ్ల్యూ ఏసీ ఛార్జర్ ను వినియోగించి 4.5 గంటల్లో రీఛార్జ్ చేసుకోవచ్చు.  

నానో కారు స్పూర్తితో  
2008 జనవరి 10న ఇండియాలో విడుదలైన టాటా నానో కారు ఎంత పాపులర్‌ అయ్యిందో మనకు తెలిసిందే. కేవలం రూ.లక్షరూపాయల విలువైన కారును టాటా మోటార్స్‌ ఆటోమొబైల్‌ సంస్థ విడుదల చేసింది. అన్నీ వర్గాల ప్రజలు కారును వినియోగించేలా టాటా సంస్థ చైర్మన్‌ రతన్‌ టాటా కారును అందుబాటులోకి తెచ్చారు. ఈ కారును ఇన్స్పిరేషన్‌తో చైనా ఆటోమొబైల్‌ సంస్థ నానో కంటే అతి చిన్న కారును తయారు చేసింది. 

చదవండి: అదిరే 'ఆడి'..ఇండియన్‌ మార్కెట్‌లో మరో సూపర్‌ ఎలక్ట్రిక్‌ కార్‌

మరిన్ని వార్తలు