ఉదయాన్నే జాగింగ్, రన్నింగ్‌ ప్రాక్టీస్‌ చేస్తున్నారా.. ఈ గ్యాడ్జెట్‌ మీకోసమే!

11 Sep, 2022 07:26 IST|Sakshi

టార్చిలైట్‌ చేత్తో పట్టుకుంటే గాని, చీకట్లో ముందుకు అడుగేయడం కష్టం. గనుల్లో పనిచేసేవాళ్లు నెత్తికి ధరించే హెల్మెట్‌కు టార్చ్‌లైట్‌ పెట్టుకుంటారు. చేతికి పనిలేకుండా నడుముకు బెల్టులా చుట్టేసుకునే టార్చిని చైనాకు చెందిన బహుళజాతి కంపెనీ ‘నైట్‌కోర్‌’ ఇటీవల ‘నైట్‌కోర్‌ యూటీ05’ పేరిట అందుబాటులోకి తెచ్చింది. యూఎస్‌బీ పోర్ట్‌ ద్వారా దీనిని తేలికగా చార్జింగ్‌ చేసుకోవచ్చు.

దీని బరువు కూడా చాలా తక్కువ– కేవలం 39 గ్రాములే! నడుము బెల్టులాగ ధరిస్తే, ఏమాత్రం అసౌకర్యంగా ఉండదు. అవసరమైనప్పుడు స్విచాన్‌ చేసుకుంటే, దీని ముందువైపు ఉండే రెండు ఎల్‌ఈడీ లైట్ల నుంచి వెలుతురు వస్తుంది. చుట్టూ 160 డిగ్రీల పరిధిలో వెలుతురు వ్యాపించడంతో పొద్దునే జాగింగ్, రన్నింగ్‌ ప్రాక్టీస్‌ చేసేవాళ్లకు ఇది చాలా సౌకర్యంగా ఉంటుంది. కరెంటులేని చోట్ల నడుస్తూ ముందుకు సాగడానికి కూడా ఉపయోగకరంగా ఉంటుంది. దీని ధర 63.85 డాలర్లు (రూ.5,105). దీనిని కొనుగోలు చేస్తే, దీనికి తగిలించుకోవడానికి వీలయ్యే కీచైన్‌ ఉచితంగా లభిస్తుంది.

చదవండి: వారెవ్వా, సూపర్‌ ట్రాక్టర్‌.. డ్రైవర్‌ లేకపోయినా పని చేస్తుంది!

మరిన్ని వార్తలు