ఎవడి డప్పు వాడు కొట్టుకున్నా.. వందల కోట్లు కట్టాల్సిందే...!

28 Nov, 2021 09:29 IST|Sakshi

చైనాలో సెలబ్రిటీలపై అక్కడి ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. వారిపై ఆంక్షలు విధిస్తూ వేధిస్తుంది. ఇంతకీ అక్కడి కమ్యూనిస్ట్‌ ప్రభుత్వం ఎందుకు అలా చేస్తుంది..? చర‍్యలతో ఏం సాధించాలని చూస్తుంది..? 

చైనా కమ్యూనిజానికి మించి అక్కడి సెలబ్రిటీలు పాపులర్‌ కావడం సహించలేక పోతుంది. ముఖ్యంగా ఎంటర్టైన్మెంట్ రంగానికి చెందిన సెలబ్రిటీలపై గుర్రుగా ఉంది. వారిపై కొత్త ఆంక్షలు విధించి వేధిస్తుంది. సోషల్‌ మీడియాలో వారి సంపద, లైఫ్‌స్టైల్‌ పై గొప్పలు చెప్పకుండా నిషేధం విధించింది. అందుకే సెలబ్రిటీ కల్చర్‌కు చెక్‌ పెట్టేందుకు కొత్తరూల్‌ తెచ్చినట్లు సైబర్‌ స్పేస్‌ అడ్మినిస్ట్రేషన్‌ ఆఫ్‌ చైనా తెలిపింది.

సెలబ్రిటీ కల్చర్‌ చాలా ప్రమాదం..
సెలబ్రిటీ కల్చర్‌, సంపాదించాలనే అత్యాశ పాశ్చాత్య దేశాలకు చెందిందని, అది ప్రమాదకర అంశం అనేది చైనా ప్రభుత్వ బావన. ఇదే చైనా దేశ కమ్యూనిజానికి ముప్పు తెస్తుందనేది వారి వాదన. అందుకే సెలబ్రిటీల పట్ల కఠినంగా వ్యవహరిస్తుంది. కొందరి సెలబ్రిటీలను బ్లాక్‌ లిస్ట్‌లో చేర్చి కదలికలను కనిపెడుతోంది.అంతేకాదు ట్యాక్స్‌లు ఎగ్గొట్టారంటూ అక్రమ కేసులు బనాయించి..సెలబ్రిటీలకు భారీగా జరిమానా విధిస్తుంది చైనా కమ్యూనిస్ట్‌ ప్రభుత్వం. భవిష్యత్‌లో వారికి ఎలాంటి అవకాశాలు లేకుండా చేస్తుంది. వారి వాదనలు ప్రజల్లోకి వెళ్లకుండా చర్యలు చేపట్టింది. వెబ్‌సైట్ల నుంచి సెలబ్రిటీల వీడియోల్ని తొలగించి వారిని ఫ్యాన్స్‌కి దూరం చేస్తోంది. అందుకు ప్రత్యక్ష ఉదాహరణే జెంగ్ షువాంగ్ ఉదంతం. 

2009లో తైవాన్ టీవీ సీరిస్ 'మేటర్ షవర్' (Meteor Shower) రీమేక్ తో 'జెంగ్‌ షువాంగ్‌' బుల్లితెరకు పరిచయమైంది. సీన్‌ కట్‌ చేస్తే ఇప్పుడు ఆమె చైనా దేశంలో ఎంటర్టైన్మెంట్  రంగానికి చెందిన సెలబ్రిటీలలో తొలిస్థానంలో ఉంది. మిగిలిన సెలబ్రిటీల కంటే ఈమెకు ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ బీభత్సంగా ఉంది. ఆ ఫ్యాన్‌ ఫాలోయింగే ఆమెకు కష్టాలు తెచ్చి పెట్టింది. డ్రాగన్‌ కంట్రీ సెలబ్రిటీలపై తెచ్చిన కొత్త చట్టం జెంగ్‌ షువాంగ్‌ను ఆకాశం నుంచి అథఃపాతాళానికి..చేర్చింది. చైనా ప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగానే నటిపై చర్యలు తీసుకుంది. ఆమె పన్నులు చెల్లించడం లేదనే కారణంతో ఈ ఏడాది ఆగస్ట్‌ నెలలో రూ.337 కోట్లు జరిమానా విధించి, చైనా స్టేట్ బ్రాడ్‌కాస్టింగ్ రెగ్యూలేటర్ టీవీలో ప్రసారమవుతున్న కార్యక్రమాలను నిలిపివేసింది. నిర్మాతలు ఆమెకు అవకాశాలు ఇవ్వరాదని డ్రాగన్‌ కంట్రీ హెచ్చరికులు జారీ చేసింది.

చదవండి: చైనా మీదే జోక్‌.. భారీ డ్యామేజ్‌ భయంతో ముందే క్షమాపణలు!

మరిన్ని వార్తలు