ఐదేళ్ల ముందు ఆ వ్యాపారవేత్త చెప్పిన జోస్యం నిజమవుతుందా!

20 Nov, 2022 08:33 IST|Sakshi

రోబోలకు కృత్రిమ మేధ జోడిస్తే, ప్రస్తుత ప్రపంచంలో మనుషులు చేసే చాలా ఉద్యోగాలకు ఎసరొస్తుందనే ఆందోళన చాలామందిలో ఉంది. సమీప భవిష్యత్తులో ఆ ఆందోళన నిజమయ్యేటట్లే కనిపిస్తోంది. చైనాలోని ‘నెట్‌డ్రాగన్‌ వెబ్‌సాఫ్ట్‌’ అనే మెటావెర్స్‌ కంపెనీ ఇటీవల కృత్రిమ మేధతో పనిచేసే ‘మిస్‌ టాంగ్‌ యు’ అనే ఒక రోబోను తన సీఈవోగా నియమించుకుంది.

వెయ్యి కోట్ల డాలర్ల (82 వేల కోట్లు) విలువ చేసే ఈ కంపెనీ వ్యవహారాలను ఈ రోబో సీఈవో పర్యవేక్షించనుంది. కంపెనీలో అత్యంత కీలకమైన ఆర్గనైజేషనల్‌ అండ్‌ ఎఫిషియెన్సీ డిపార్ట్‌మెంట్‌కు నాయకత్వం వహించనుంది. కంపెనీకి చెందిన రోజువారీ పనులు క్రమపద్ధతిలో జరిగేలా చూడటం, పనుల అమలు వేగంగా, నాణ్యంగా పూర్తయ్యేలా చూడటం వంటి విధులను ‘మిస్‌ టాంగ్‌ యు’ నిర్వర్తించనుందని ‘నెట్‌డ్రాగన్‌ వెబ్‌సాఫ్ట్‌’ ఇటీవల ప్రకటించింది. ఈ రోబో సీఈవోను చూస్తుంటే, ఐదేళ్ల కిందట చైనీస్‌ వ్యాపారవేత్త జాక్‌ మా చెప్పిన జోస్యం నిజమైనా ఆశ్చర్యం అక్కర్లేదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. మరో ముప్పయ్యేళ్లలో ఒక రోబో ఉత్తమ సీఈవోగా ‘టైమ్‌’ మ్యాగజీన్‌ కవర్‌పేజీపై కనిపించగలదంటూ 2017లో జాక్‌ మా చేసిన వ్యాఖ్యలను వారు గుర్తు చేస్తున్నారు.

చదవండి: ఉద్యోగులకు ఊహించని షాక్‌!..ట్విటర్‌,మెటా బాటలో మరో దిగ్గజ సంస్థ!

మరిన్ని వార్తలు