Alibaba Lays Off: ఉద్యోగులకు జాక్‌ మా భారీ షాక్‌, వేలాది మందిపై వేటు!

7 Aug, 2022 17:35 IST|Sakshi

అంతర్జాతీయ ఈకామర్స్‌ సంస్థ అలీబాబా ఉద్యోగులకు భారీ షాకిచ్చింది. సంస్థ సేల్స్‌ తగ్గడంతో ఖర్చులు తగ్గించుకునేందుకు అలీబాబా ఫౌండ్‌ జాక్‌ మా సుమారు 10వేల మంది ఉద్యోగులపై వేటు వేసినట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని అలీబాబా గ్రూప్ అనుబంధ మీడియా సంస్థ సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ తన కథనంలో పేర్కొంది. 

చైనా ప్రభుత్వ విధానాలతో వృద్దిరేటు పడిపోవడం, రెండేళ్ల క్రితం అలీబాబా డ్రాగన్‌ ప్రభుత్వంపై,నియంత్ర‌ణ సంస్థ‌ల‌పైనా అలీబాబా ఫౌండ‌ర్ జాక్‌మా విమ‌ర్శ‌లు గుప్పించారు. నాటి నుంచి జాక్‌ మాపై దర్యాప్తు సంస్థలు ఉక్కు పాదం మోపుతూ వస్తున్నాయి. ఫలితంగా అలీ బాబా గ్రూప్‌ నష్టాల్లో కూరుకుపోతుంది.   

జూన్ నెల‌తో ముగిసిన త్రైమాసికంలో 22.74 బిలియ‌న్ల యువాన్ల విక్ర‌యాలు జ‌రిపింది. గ‌తేడాది 45.14 బిలియ‌న్ల యువాన్ల విలువైన వ‌స్తువుల అమ్మకాలు జరిపింది. అయితే ద్రవ్యోల్బణం, నష్టాల్ని తగ్గించుకునేందుకు జాక్‌ మా ప్రయత్నాలు ప్రారంభించారు. అందుకే 10వేల మంది ఉద్యోగుల్ని తొలగించారని, ఇప్పటి వరకు మొత్తం ఉద్యోగుల సంఖ్య 2.45 ల‌క్ష‌ల‌కు త‌గ్గినట్లు పలు కథనాలు వెలుగులోకి వచ్చాయి.

మరిన్ని వార్తలు