semiconductor shortage: కార్ల అమ్మకాలకు సెమీకండక్టర్ల బ్రేకులు

2 Oct, 2021 07:47 IST|Sakshi

నిరాశపరిచిన సెప్టెంబర్‌ వాహన విక్రయాలు 

సగానికి తగ్గిన  మారుతీ సుజుకీ అమ్మకాలు  

ముంబై: పండుగ సీజన్‌పై గంపెడు ఆశలు పెట్టుకున్న ఆటో కంపెనీలకు నిరాశ ఎదురైంది. పరిశ్రమను సెమీకండక్టర్లు, ఎలక్ట్రిక్‌ చిప్‌ల కొరత వేధించడంతో సెప్టెంబర్‌ విక్రయాల్లో క్షీణత నమోదైంది.

మారుతీ సుజుకీ, హ్యుందాయ్, మహీంద్రా అండ్‌ మహీంద్రాతో సహా ఆటో పరిశ్రమలో పలు కంపెనీల విక్రయాలు తగ్గాయి. సమీక్షించిన నెలలో మారుతీ సుజుకీ 86,380 యూనిట్ల వాహనాలను అమ్మగా.. గతేడాది సెప్టెంబర్‌లో మొత్తం 1,60,442 యూనిట్లను విక్రయించింది. ‘‘ఎలక్ట్రానిక్‌ విడిభాగాల కొరత కారణంగానే సెప్టెంబర్‌ అమ్మకాలు తగ్గాయి.

ఈ సమస్య పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటాము’’ అని మారుతీ తెలిపింది. ఇదే నెలలో హ్యుందాయ్‌ మోటార్‌ అమ్మకాలు 23 శాతం క్షీణించి 45,791 వాహనాలకు చేరాయి. అయితే వార్షిక ప్రాతిపదికన టాటా మోటార్స్, ఎంజీ మోటార్స్, నిస్సాన్‌ మోటార్స్‌ విక్రయాలు వరుసగా 26%, 28%, 100% చొప్పున వృద్ధిని సాధించాయి.  

చదవండి: జియోకు కొత్త చిక్కులు,పెరగనున్న 'జియో నెక్ట్స్‌' ఫోన్‌ ధరలు?

మరిన్ని వార్తలు