జాక్‌ పాట్‌ కొట్టేసిన సిగ్నిటీ టెక్నాలజీస్‌!

20 Apr, 2022 20:13 IST|Sakshi

న్యూఢిల్లీ: ఐటీ సంస్థ సిగ్నిటీ టెక్నాలజీస్‌ తాజాగా 10 మిలియన్‌ డాలర్ల (సుమారు రూ. 76 కోట్లు) ఆర్డరు దక్కించుకుంది. అమెరికాకు చెందిన అతి పెద్ద ఆర్థిక సేవల సంస్థల్లో ఒక దాన్నుంచి ఈ వార్షిక కాంట్రాక్టును దక్కించుకున్నట్లు సంస్థ సీఈవో శ్రీకాంత్‌ చక్కిలం వెల్లడించారు. 

భారీ డీల్స్‌ దక్కించుకోవడంలో తమ సామర్థ్యాలకు ఇది నిదర్శనమని ఆయన వివరించారు. తమ ఆదాయాల్లో బీఎఫ్‌ఎస్‌ఐ వాటా మరింత పెరిగేందుకు ఈ డీల్‌ తోడ్పడగలదని శ్రీకాంత్‌ చెప్పారు.

మరిన్ని వార్తలు