దిగ్గజ కంపెనీ కీలక నిర్ణయం - వేలాది ఉద్యోగులు ఇంటికి..

10 Feb, 2024 15:23 IST|Sakshi

భారతదేశంలో మాత్రమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న చాలా దిగ్గజ కంపెనీలు 2024లో కూడా తమ ఉద్యోగులను తొలగిస్తూనే ఉంది. ఇందులో భాగంగానే 'సిస్కో' కంపెనీ ఇప్పుడు వేలాదిమందిని ఇంటికి పంపే యోచనలో ఉంది. లేఆఫ్‌ల వల్ల ప్రభావితం అయ్యే మొత్తం ఉద్యోగుల సంఖ్యపై కంపెనీ ఇంకా ఎటువంటి సమాచారం వెల్లడించలేదు.

కంపెనీ వ్యాపారాన్ని పునర్నిర్మించుకోవడంలో భాగంగానే.. ఉద్యోగులను తొలగించనున్నట్లు సమాచారం. ఇప్పటికే గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, సేల్స్ ఫోర్స్, స్నాప్ చాట్ వంటి సంస్థలు ఖర్చులను తగ్గించుకోవడంలో భాగంగా వందలాది మందిని ఇప్పటికే ఇంటికి పంపింది. ఈ జాబితాలోకి ఇప్పుడు సిస్కో చేరింది.

2023లో కంపెనీలోని మొత్తం ఉద్యోగుల సంఖ్య 84900. ఇందులో ఈ ఏడాది ఎంతమందిని తీసేయాలని విషయాన్ని అధికారికంగా ప్రకటించలేదు. ఫిబ్రవరి 14న కంపెనీ తన ఫలితాలను వెల్లడించనుంది, ఆ సమయంలో ఎంతమందిని కంపెనీ నుంచి ఇంటికి పంపిందనే విషయం తెలుస్తుంది.

ఇదీ చదవండి: 'సుందర్ పిచాయ్' రోజూ చూసే వెబ్‌సైట్‌ ఇదే..

ప్రస్తుతం కంపెనీలోని ఉద్యోగులలో కనీసం 5 శాతం మంది ఉద్యోగులు తమ ఉద్యోగాలను కోల్పోయే అవకాశం ఉందని అంచనా. గతంలో నోకియా, ఎరిక్సన్ వంటి టెలికామ్ దిగ్గజాలు కూడా నష్టాల్లో ఉన్నప్పుడు వేలాదిమంది ఉద్యోగులను తొలగించాయి. ఇటీవల స్నాప్‌చాట్ మాతృసంస్థ స్నాప్ కూడా తన మొత్తం ఉద్యోగుల్లో 10 శాతం మందిని తొలగిస్తున్నట్లు ప్రకటన చేసింది.

whatsapp channel

మరిన్ని వార్తలు

Garudavega