వృద్ధి అవకాశాల్లో భారత్‌ నెంబర్‌ వన్‌

11 May, 2023 06:20 IST|Sakshi
విదేశాంగశాఖ మంత్రి ఎస్‌ జైశంకర్‌తో సిస్కో సీఈఓ చక్‌ రాబిన్స్‌ భేటీ

తయారీకి హబ్‌గా రూపొందుతున్న దేశం

సిస్కో సీఈవో చక్‌ రాబిన్స్‌  

న్యూఢిల్లీ: అమెరికా నెట్‌వర్క్‌ పరికరాల తయారీ సంస్థ– సిస్కో  భారత్‌లో తన భారీ పెట్టుబడుల ప్రణాళికలను ప్రకటించింది.  రూటర్లు, స్విచ్‌ల వంటి ఉత్పత్తుల తయారీకి సంబంధించిన భారత ప్రణాళికలను చైర్మన్, సీఈఓ చక్‌ రాబిన్స్‌ ప్రకటించారు. డిజిటల్‌ మౌలిక సదుపాయాలపై దేశం అద్భుతమైన పురోగతిని సాధించిందని పేర్కొంటూ,  వచ్చే దశాబ్దపు వృద్ధి అవకాశాలకు సంబంధించి భారత్‌ మొదటి అవకాశంగా ఉందని అన్నా రు. తయారీ రంగానికి కేంద్రంగా భారత్‌ రూపుదిద్దుకుంటోందని ఆయన అన్నారు.

బహుళ పథకా లు ఇందుకు దోహదపడుతున్నట్లు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో తమ తయారీ కార్యకలాపాలు సిస్కో కాంట్రాక్ట్‌ తయారీదారుల ద్వారా ప్రారంభమవుతాయని తెలిపారు. బిలియన్‌ డాలర్ల ఎగుమతులు సమీపకాలంలో జరుగుతాయని తాము భావిస్తున్నామన్నారు. ప్రధాని నరేంద్రమోదీ, విదేశాంగమంత్రి ఎస్‌ జైశంకర్‌ తదితర సీనియర్‌ అధికారులతో ఆయన సమావేశమయ్యారు. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ చైర్మన్‌ ముకేశ్‌ అంబానీతో ఆయన భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నేపథ్యంలో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ముఖ్యాంశాలు...

► ప్రపంచ స్థూల ఆర్థిక అనిశ్చితులు, అమెరికా బ్యాంకింగ్‌ సంక్షోభం  భౌగోళిక రాజకీయ భయాల నేపథ్యంలో టెక్‌ డిజిటలైజేషన్‌ వ్యూహాత్మక విలువ మందగించాలి. కానీ అలా జరక్కపోవడం హర్షణీయం. పైగా ఇది పురోగతి బాటన నడుస్తోంది. టెక్నాలజీకి సంబంధి ప్రతి దేశం సాధిస్తున్న విజయానికి ఇది సంకేతం.  
► డిజిటలైజేషన్, 5జీ రోల్‌అవుట్, నైపుణ్య సామర్థ్యాలు, స్టార్టప్‌ వ్యవస్థ దీనిని బలపరిచే మౌలిక వ్యవస్థ భారత్‌కు కలిసివస్తున్న అంశాలు.  
► భారత్‌ డిజిటలైజేషన్‌లో భారీగా పురోగమించింది. మహమ్మారి సమయంలో అలాగే తీవ్ర సవా ళ్ల సమయాల్లో డిజిటలైజేషన్‌లో దేశం పటిష్ట పురోగతిని సాధించింది. పురోగతి విషయంలో భారత్‌ ఆశయం చాలా స్పష్టంగా ఉంది.  ఇది హర్షణీయ పరిణామం. ప్రధానమంత్రి, పలువురు మంత్రులు, పారిశ్రామికవేత్తలు అనేక అంశాల గురించి మాట్లాడారు. తయారీ నుంచి నైపుణ్యత, సిస్కో కార్యకలాపాలు, ఆర్టిఫిషీయల్‌ ఇంటిలిజెన్స్, 5జీ, సుస్థిర అభివృద్ధి వరకూ అన్ని అంశాలపై ప్రధాని మోదీతో చర్చించడం జరిగింది. భారతదేశంలో తయారీ పురోగతి విషయంలో సహకారం ఇచ్చే విషయంలో మా నిబ ద్ధతను ఈ సందర్భంగా పునరుద్ఘాటించాను.  
► ఒక్క డిజిటలైజేషన్‌లోనే కాదు. భౌతికంగా మౌలిక సదుపాయాల కల్పనలోనూ భారత్‌ దూసుకుపోతోంది.  
► మేడిన్‌ ఇండియా సిస్కో ప్రొడక్టులు ఈ ప్రాంతానికి, యూరప్‌కు ఎగుమతి అవుతాయి. దేశంలో క్రమంగా మా వ్యాపార కార్యకలాపాలను విస్తరిస్తాం. ముఖ్యంగా 5జీ పై మాకు ఎక్కువ ఆసక్తి ఉంది. ప్రతి చోటకూ కనెక్టివిటీ హైస్పీడ్‌కు దోహపపడే అంశం ఇది.  
► ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ రంగంలో చోటుచేసుకుంటున్న ఉద్యోగాల కోత ఫలితాలు, పర్యవసానాలు మున్ముందు ఎలా మారతాయన్న విషయాన్ని ఇప్పుడే చెప్పలేం.
విదేశాంగశాఖ మంత్రి ఎస్‌ జైశంకర్‌తో సిస్కో సీఈఓ చక్‌ రాబిన్స్‌ భేటీ

మరిన్ని వార్తలు