మూన్‌లైటింగ్‌పై సుప్రీం ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్‌ సంచలన వ్యాఖ్యలు

5 Dec, 2022 18:21 IST|Sakshi

ఒకచోట ఉద్యోగం చేస్తూనే రహస్యంగా మరొక ఉద్యోగం కూడా చేస్తుండటాన్ని ‘మూన్‌లైటింగ్‌’ అంటారు. అయితే టెక్‌ కంపెనీల చట్టం ప్రకారం ఒకేసారి రెండేసి ఉద్యోగాలు చేయకూడదన్న నిబంధన ఉంది. ఆ నిబంధనను ఉల్లంఘించారన్న కారణంతోనే విప్రో 300 మంది ఉద్యోగుల్ని ఫైర్‌ చేసింది.

ఆ తొలగింపులే ఐటీ రంగంలో ప్రకంపనలు పుట్టించి, ఆ ఐటీ దిగ్గజం చేసిన పని సమంజసమేనా అనే చర్చకు దారి తీసింది. ఈ నేపథ్యంలో భారత నూతన ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్‌ ధనంజయ యశ్వంత్‌ చంద్రచూడ్‌ మూన్‌లైటింగ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు.  

గత వారం సుప్రీంకోర్టు 50వ ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించిన సీజేఐ చంద్రచూడ్‌ మూన్‌లైటింగ్‌పై స్పందించారు. తాను ఆల్‌ ఇండియా రేడియో(ఏఐఆర్‌)లో రేడియో జాకీగా పనిచేసే సమయంలో మూన్‌లైటింగ్‌కు పాల్పడినట్లు తెలిపారు. ఓవైపు లాయర్‌గా పనిచేస్తూనే ఏఐఆర్‌లో ‘ప్లే ఇట్‌ కూల్‌, ఏ డేట్‌ విత్‌ యూ, సండే రిక్వెస్ట్‌’ అనే షోస్‌గా వ్యవహరించినట్లు ఓ సమావేశంలో  చెప్పారు. ఆ వీడియోని బార్‌ అండ్‌ బెంచ్‌ ట్విటర్‌ పేజీలో పోస్ట్‌ చేసింది. 

అదనపు ఆదాయం కోసం సంస్థలో పనిచేస్తూ..మరో సంస్థలో మరో జాబ్‌ చేయడానికి మూన్‌లైటింగ్‌ అంటారు?. అయితే  కాన్ఫరెన్స్‌లో సీజేఐ మాట్లాడుతూ..అప్పట్లో దీని గురించి (మూన్‌లైటింగ్‌) చాలా మందికి తెలియదు. నా 20 ఏళ్ల వయసులో నేను మూన్‌లైటింగ్‌ చేశా. రేడియో జాకీగా పైన పేర్కొన్న ప్రోగ్రామ్స్‌ చేసినట్లు తెలిపారు.‘ఈ సందర్భంగా తన అభిరుచిల్ని బయటపెట్టారు.నేటికీ సంగీతంపై నాకున్న అభిమానం కొనసాగుతోంది. అందుకే ప్రతిరోజూ న్యాయ విధులు నిర్వహిస్తూనే..ఇంటికి వెళ్లి మ్యూజిక్‌ వింటున్నట్లు వెల్లడించారు.

మూన్‌లైటింగ్‌ అంటే మోసం చేయడమే  
ఇటీవల మనదేశంలో పలు కంపెనీలు మూన్‌లైటింగ్‌ను వ్యతిరేకిస్తున్నాయి. ఈ ఏడాది అక్టోబర్‌లో ఐటీ కంపెనీ హ్యాపిహెస్ట్‌ మైండ్స్‌ టెక్నాలజీస్‌ రెండో ఉద్యోగం చేస్తున్న ఉద్యోగుల్ని విధుల నుంచి తొలగించింది.

విప్రో ఛైర్మన్ రిషద్ ప్రేమ్‌జీ ట్విటర్‌లో మూన్‌లైటింగ్‌ అంటే సంస్థల్ని మోసం చేయడంతో సమానమేనని అన్నారు. అప్పటి నుంచి దేశీయ ఐటీ పరిశ్రమలో మూన్‌లైటింగ్‌ చర్చంశనీయంగా మారింది.

చదవండి👉 మీ ఉద్యోగం పోయింది కదా..మీకెలా అనిపిస్తుంది?’

మరిన్ని వార్తలు