షిండ్లర్‌ ట్రైనింగ్‌ సెంటర్‌ను సందర్శించిన సీఎం జగన్‌

26 May, 2022 13:38 IST|Sakshi

వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరమ్‌ సదస్సులో భాగంగా దావోస్‌ పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ బిజీబిజీగా గడుపుతున్నారు. వివిధ కంపెనీల సీఈవోలు, ఫౌండర్లు, ఇతర టాప్‌ ఎగ్జిక్యూటివ్‌లతో నిర్విరామంగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఫలితంగా విశాఖ, మచిలీపట్నాలకు భారీ ఎత్తున పెట్టుబడులను ఆకర్షించగలిగారు. ముఖ్యంగా ఐటీ, విద్య, భూరికార్డుల సర్వే, డీకార్బనైజ్డ్‌ సెక్టార్‌లో ఇన్వెస్టర్లను ఆకర్షించ గలిగారు.


కాగా 2022 మే 26న సీఎం జగన్‌ దావోస్‌లో ఉన్న షిండ్లర్‌ ట్రైనింగ్‌ సెంటర్‌ను పరిశీలించారు. ట్రైనింగ్‌ సెంటర్‌ అంతా కలియదిరుగుతూ అక్కడ శిక్షణ జరుగుతున్న తీరును షిండ్లర్‌ ప్రతినిధులు సీఎం జగన్‌కు వివరించారు.

 

చదవండి: CM YS Jagan Davos Tour: ‘యూనికార్న్‌’ విశాఖ

మరిన్ని వార్తలు