Amazon:ఆ సైట్‌లో కొన్న ఎలక్ట్రానిక్‌ వస్తువులు మండిపోతున్నాయట

14 Jun, 2021 19:25 IST|Sakshi

ఛార్జర్లు, సర్జ్‌ ప్రొటెక్టర్‌,  మైక్రో ఓవెన్లతో ఇబ్బందులు

కన్సుమర్‌ కోర్టులను ఆశ్రయిస్తున్న వినియోగదారులు 

న్యూయార్క్‌ : ప్రముఖ ఆన్‌లైన్‌ దిగ్గజం అమెజాన్‌ డాట్‌ కామ్‌లో కొనుగోలు చేసిన ఎలక్ట్రానిక్‌ వస్తువులు కాగడాల్లా మారుతున్నాయి. ఉన్నట్టుండి పొగలు కక్కుతూ కాలి బూడిదవుతున్నాయి. గత రెండేళ్లుగా కొన్ని ఎలక్ట్రానిక్‌ వస్తువులు విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు అమెరికన్లు చెబుతున్నారు. అమెజాన్‌ బ్రాండ్‌ వస్తువులు అకస్మాత్తుగా కాలిపోతుండటంపై అమెరికాలోని కన్సుమర్‌ ప్రొడక్ట్‌ సేఫ్టీ కమిటీ (CPSC) చేపట్టిన విచారణ కొనసాగుతోంది. ఈ మేరకు CPSC ఇచ్చిన నివేదికల ఆధారంగా సీఎన్‌ఎన్‌ పలు కథనాలు ప్రచురించింది.

​కాలిపోతున్నవి ఇవే
వరల్డ్‌లోనే నంబర్‌ వన్‌ ఈ కామర్స్‌ సైట్‌ అమెజాన్‌లో ఎలక్ట్రిక్‌, ఎలక్ట్రానిక్‌ కేటగిరిలలో కొనుగోలు చేసిన సర్జ్‌ ప్రొటెక్టర్‌,  ఫోన్‌ ఛార్జింగ్‌ కార్డ్స్‌, పాటియో హీటర్‌, బ్యాటరీ ఛార్జర్‌, వాయిస్‌ యాక్టివేటెడ్‌ మైక్రో ఓవెన్లుపై CPSCకి ఎక్కువగా ఫిర్యాదులు అందాయి. ఆయా వస్తువులను వాడుతున్నప్పుడు ఉన్నట్టుండి మధ్యలోనే కాలిపోతున్నట్టు వినయోగదారులు పేర్కొన్నారు. ఈ వస్తువలన్నీ అమెజాన్‌ బ్రాండ్‌కి సంబంధించినే కావడం గమనార్హం. 

బాధితులు
అమెజాన్‌ సైట్‌ నుంచి 2018లో సర్జ్‌ ప్రొటెక్టర్‌ను ఓ వ్యక్తి కొనుగోలు చేయగా..అది ఇంట్లో కాలిపోయింది. ఫలితంగా ఇంటికి డ్యామేజ్‌ జగిరింది. దీనిపై CPSCని ఆశ్రయించగా 1500 డాలర్ల నష్టపరిహారం ఆ బాధితుడు సీఎన్‌ఎన్‌ పేర్కొంది. ఆ తర్వాత మరో 40 మంది ఇదే ప్రొడక్టు కొని నష్టపోయినట్టు రివ్యూ ఇచ్చారు. దీంతో 2019లో తన సైట్‌ నుంచి ఆ ప్రొడక్టును అమెజాన్‌ తొలగించినట్టు సీఎన్‌ఎన్‌ తన కథనంలో పేర్కొంది. 

స్పందించని అమెజాన్‌
CPSC విచారణపై స్పందించేందుకు అమెజాన్‌ నిరాకరించింది. తమ కస్టమర్ల భద్రత తమకు ఎంతో ముఖ్యమని,  నాణ్యత విషయంలో రాజీపడేది లేదంటూ అమెజాన్‌ డాట్‌కామ్‌ చెబుతోంది. సీఎన్‌ఎన్‌ రిపోర్టులో పేర్కొన్నట్టు ఏ వస్తువును సేఫ్టీ రీజన్స్‌తో తమ సైట్‌ నుంచి తొలగించలేదంది. 
 

>
మరిన్ని వార్తలు