ఈ తోడికోడళ్లు రూ.600 కోట్లు టర్నోవర్‌ చేస్తున్నారు.. వీరి వ్యాపారమేంటో తెలుసా?

1 Apr, 2023 14:22 IST|Sakshi

రికా జైన్, కిమీ జైన్ ఇద్దరూ తోడికోడళ్లు.. విజయవంతంగా వ్యాపారాన్ని నిర్వహిస్తూ అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారు. వీరు 2012లో ప్రీమియం హోటల్ టాయిలెట్రీ (టాయ్‌లెట్‌లో ఉపయోగించే సబ్బులు, షాంపులు, హెయిర్‌ కండీషనర్లు, టూత్‌ పేస్టులు, టాయ్‌లెట్‌ పేపర్లు తదితర వస్తువులు) తయారీ వ్యాపారాన్ని ప్రారంభించారు.

(క్రిక్‌పే లాంచ్ ఆలస్యమైంది.. క్షమించండి) 

కరోనా మహమ్మారి సమయంలో వారు జీవనశైలికి సంబంధించిన వస్తువుల వ్యాపారాన్ని కూడా ప్రారంభించారు. ఈ తోడికోడళ్లకు కెనడాకు చెందిన హాస్పిటాలిటీ ఉత్పత్తుల తయారీ సంస్థలో భాగస్వామ్యం ఉంది. తక్కువ వ్యవధిలోనే వారి వ్యాపార టర్నోవర్ రూ.600 కోట్లకు పెరిగింది. ఇంతకీ వాళ్ల కంపెనీ పేరు ఏంటంటే.. 
‘కిమిరికా’.

తన భర్త రజత్ జైన్‌తో కలిసి ఓ హోటెల్‌కు వెళ్లినప్పుడు రికా జైన్‌ అక్కడి గదిలోని టాయిలెట్రీ వస్తువులను గమనించారు. వాటిని విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నట్లు గుర్తించారు. అప్పుడే ఆమెకు ఈ వ్యాపార ఆలోచన వచ్చింది. వెంటనే మోహిత్, కిమీ జైన్‌లతో కలిసి టాయిలెట్రీ  వ్యాపారాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత హంటర్ ఎమినిటీస్‌తో భాగస్వామ్యం కుదుర్చుకున్నారు. కిమిరికా హంటర్ ఇంటర్నేషనల్, కిమిరికా లైఫ్ స్టైల్ వ్యాపారాల వార్షిక టర్నోవర్ రూ.600 కోట్లు.

(‘మారుతీ ఆల్టో 800’ను ఇక కొనలేరు! ఎందుకంటే...)

కిమీ జైన్ మధ్య ప్రదేశ్‌లోని ఒక గ్రామంలో జన్మించారు. తర్వాత 1991లో ఆమె చదువు కోసం కుటుంబమంతా ఇండోర్‌కు వచ్చేశారు. ఇక రికా ఇండోర్‌లోనే పుట్టి పెరిగారు. సోదరులైన మోహిత్, రజత్‌లతో వీరికి వివాహమైంది. కిమీ ఈ-కామర్స్‌లో ఎంబీఏ పూర్తి చేశారు. రికా ఫార్మసీ డిగ్రీ చేశారు. వీరి కంపెనీలో 600 మంది కార్మికులు పని చేస్తున్నారు. వీరిలో 80 శాతం మంది మహిళలే. వారి విక్రయాలలో ఎక్కువ భాగం ఆన్‌లైన్ ఛానెల్‌ల నుంచి వస్తుంది.

వారు తమ డైరెక్ట్ టు కస్టమర్ లైఫ్‌స్టైల్ బ్రాండ్‌ను ప్రారంభించిన తర్వాత మొదటి ఆరు నెలలూ కేవలం 2500 మంది కస్టమర్లు మాత్రమే ఉండేవారు. దీంతో  లైఫ్‌స్టైల్ బ్రాండ్‌ను ప్రారంభించాలనే తమ నిర్ణయం సరైనదేనా అని అప్పట్లో ఆలోచనలో పడ్డారు. అయితే లాక్‌డౌన్ సమయంలో ఆన్‌లైన్ అమ్మకాలకు ప్రోత్సాహం లభించడంతో దీనిపైనే తమ శక్తిని కేంద్రీకరించి విజయమంతమయ్యారు. రాబోయే రోజుల్లో ఆఫ్‌లైన్ స్టోర్‌లకు తమ వ్యాపారాన్ని విస్తరించాలని ఈ తోడికోడళ్లు ప్లాన్ చేస్తున్నారు. ఇందులో భాగంగా నిధుల సమీకరణకు ప్రయత్నిస్తున్నారు.

(వంట గ్యాస్‌ వినియోగదారులకు ఊరట.. తగ్గిన గ్యాస్‌ సిలిండర్‌ ధర!)

మరిన్ని వార్తలు