బొగ్గు గనుల్లో డ్రోన్‌ వినియోగం

4 Feb, 2023 08:19 IST|Sakshi

న్యూఢిల్లీ: బొగ్గు ఉత్పత్తిలో ఉన్న కోల్‌ ఇండియా అనుబంధ కంపెనీ మహానది కోల్‌ఫీల్డ్స్‌ డ్రోన్‌ టెక్నాలజీని వినియోగిస్తోంది. పర్యావరణ పర్యవేక్షణ, నిల్వల స్థాయి తెలుసుకోవడానికి, గనుల చిత్రీకరణకు డ్రోన్‌ను ఉపయోగిస్తున్నట్టు కోల్‌ ఇండియా తెలిపింది. ఇందుకోసం విహంగం పేరుతో బొగ్గు మంత్రిత్వ శాఖ ఒక పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చింది.

అధీకృత వ్యక్తులు ఈ పోర్టల్‌ ద్వారా ఎక్కడి నుంచైనా డ్రోన్‌ను ఆపరేట్‌ చేయవచ్చు. ఒడిషాలోని తాల్చేర్‌ బొగ్గు గనుల్లో భువనేశ్వరి, లింగరాజ్‌ ఓపెన్‌కాస్ట్‌ మైన్స్‌లో ప్రస్తుతం పైలట్‌ ప్రాజెక్టును నిర్వహిస్తున్నారు. దేశంలో ఉత్పత్తి అవుతున్న బొగ్గులో మహానది కోల్‌ఫీల్డ్స్‌ వాటా 20 శాతంపైమాటే.

చదవండి: Google Layoffs: రోడ్డెక్కిన అమెరికాలోని గూగుల్‌ ఉద్యోగులు..

మరిన్ని వార్తలు