అమ్మకానికి మరో ప్రభుత్వ రంగ సంస్థ వాటా!

27 May, 2022 21:21 IST|Sakshi

అన్‌లిస్టెడ్‌ అనుబంధ సంస్థ భారత్‌ కోకింగ్‌ కోల్‌(బీసీసీఎల్‌)లో 25 శాతం వాటాను విక్రయించనున్నట్లు ఇంధన రంగ పీఎస్‌యూ దిగ్గజం కోల్‌ ఇండియా తెలియజేసింది. తదుపరి తగిన అనుమతులు లభిస్తే బీసీసీఎల్‌ను స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో లిస్ట్‌ చేయనున్నట్లు పేర్కొంది. ఈ ఏడాది మార్చి 10న జరిగిన బోర్డు సమావేశంలో ఈ అంశాన్ని ప్రతిపాదించినట్లు వెల్లడించింది.

బొగ్గు శాఖ(ఎంవోసీ) సూచనలమేరకు బీసీసీఎల్‌లో 25శాతం వాటాను విక్రయించేందుకు బోర్డు ముందస్తు అనుమతిని మంజూరు చేసినట్లు పేర్కొంది. తదుపరి స్టాక్ ఎక్స్ఛేంజ్‌లలో లిస్టింగ్‌ను చేపట్టనున్నట్లు తెలియజేసింది. ఈ అంశంలో మరిన్ని అనుమతుల కోసం ఎంవోసీకి ప్రతిపాదించినట్లు వెల్లడించింది.

అయితే బోర్డు సూచనప్రాయ అనుమతిని మాత్రమే మంజూరు చేసిందని, ఎంవోసీ నుంచి క్లియరెన్స్‌ లభిస్తే లిస్టింగ్‌ సన్నాహాలు చేపడతామని వివరించింది. 2020–21లో 37.13 మిలియన్‌ టన్నుల లక్ష్యానికిగాను 24.66 ఎటీ ఉత్పత్తిని మాత్రమే బీసీసీఎల్‌ సాధించినట్లు ఈ సందర్భంగా కోల్‌ ఇండియా వెల్లడించింది.  

మరిన్ని వార్తలు