Coinbase: షాకింగ్‌ నిర్ణయం..! యూపీఐ పేమెంట్స్‌తో వాటిని కొనలేరు...! 

10 Apr, 2022 19:19 IST|Sakshi

ప్రపంచవ్యాప్తంగా క్రిప్టోకరెన్సీలకు భారీ ఆదరణను పొందుతోంది. భారత్‌లో కూడా క్రిప్టోపై ఇన్వెస్ట్‌ చేసే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. భారత క్రిప్టోకరెన్సీ మార్కెట్లను దృష్టిలో ఉంచుకొని​ ప్రముఖ అమెరికన్‌ క్రిప్టో ట్రేడింగ్‌ ప్లాట్‌ఫాం కాయిన్‌బేస్‌ కూడా భారత్‌లో ఏప్రిల్‌ 7 న ఎంట్రీ ఇచ్చింది.మన దేశ క్రిప్టో ఇన్వెస్టర్లు సదరు క్రిప్టో కరెన్సీలను కొనుగోలుచేసేందుకుగాను  యూపీఐ పేమెంట్స్‌ ఆప్షన్స్‌ను కాయిన్‌బేస్‌ తీసుకొచ్చింది. కాగా 3 రోజుల క్రితమే తీసుకొచ్చిన యూపీఐ పేమెంట్స్‌ ఫీచర్‌పై కాయిన్‌బేస్‌ షాకింగ్‌ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. 


 

క్రిప్టోకరెన్సీలను యూపీఐ పేమెంట్స్‌ ద్వారా కొనుగోలుచేసే ఆప్షన్‌ను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు క్రిప్టో ట్రేడింగ్‌ ఫ్లాట్‌ఫాం కాయిన్‌బేస్‌ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఇతర ప్రత్యామ్నాయ పేమెంట్స్‌ ఆప్షన్స్‌ను ఉపయోగించి క్రిప్టోలను కొనుగోలు చేయాలని కాయిన్‌బేస్‌ సదరు క్రిప్టో ఇన్వెస్టర్లకు వెల్లడించింది. గతంలో ప్రముఖ మొబైల్‌ ఫిన్‌టెక్‌ సంస్థ మొబిక్విక్‌ వ్యాలెట్‌ కూడా దిగ్గజ క్రిప్టోకరెన్సీ ట్రేడింగ్‌ ప్లాట్‌ఫామ్స్‌తో భాగస్వామ్యాన్ని ప్రకటించింది. అయితే కొద్ది రోజుల్లోనే క్రిప్టో ట్రేడింగ్‌పై మద్దతును మొబిక్విక్‌ ఉపసంహరించుకుంది.  

ఎన్‌పీసీఐ సీరియస్‌..!
ప్రపంచంలోని అతి పెద్ద క్రిప్టో ట్రేడింగ్‌ ప్లాట్‌ఫాం కాయిన్‌బేస్‌ ఏప్రిల్‌ 7 న బెంగళూరులో జరిగిన మెగా ఈవెంట్‌లో యూపీఐ ద్వారా క్రిప్టోకరెన్సీలను కొనుగోలుచేయవచ్చునని వెల్లడించింది. కాయిన్‌బేస్‌పై వచ్చిన తాజా నివేదికలపై...నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్‌పీసీఐ) అలర్ట్‌ అయ్యింది.  కాయిన్‌బేస్‌ నిర్ణయంపై ఎన్‌పీసీఐ సీరియస్ కాగా, భారత్‌లో యూపీఐ పేమెంట్ల ద్వారా క్రిప్టో కరెన్సీలను కొనుగోలు చేసుకోవడాన్ని అనుమతించిన కంపెనీ నిర్ణయం ప్రస్తుతం రెగ్యులేటరీ స్క్రూటీనిలోకి వచ్చిందని ఎన్‌పీసీఐ పేర్కొంది. యూపీఐ పేమెంట్స్‌ను ఉపయోగించే క్రిప్టో ఎక్సేఛేంజ్ల గురించి తెలియదని ఎన్‌పీసీఐ ఒక ప్రకటనలో  స్పష్టం చేసింది.


చదవండి: గట్టి షాకిచ్చిన ఆర్బీఐ..! వారు రూ. 5 వేలకు మించి విత్‌ డ్రా చేయలేరు..!

మరిన్ని వార్తలు