Amitabh Bachchan:75వేల కోట్ల కంపెనీ ..! అందులో అమితాబ్‌ బచ్చన్‌ ఎంట్రీ...!

4 Oct, 2021 15:19 IST|Sakshi

ప్రపంచవ్యాప్తంగా సంప్రాదాయ కరెన్సీ స్థానాల్లో పలు డిజిటల్‌ కరెన్సీలు(క్రిప్టోకరెన్సీలు) గణనీయమైన అభివృద్ధిని సాధిస్తున్నాయి. ప్రపంచదేశాల్లోని ఇతర దేశాలతో పోలిస్తే భారత్‌లోని ప్రజలు క్రిప్టోకరెన్సీలను భారీగా ఆదరిస్తున్నారు. క్రిప్టోకరెన్సీకు స్వీకరణలో భారత్‌ రెండో స్థానంలో నిలవడం గమనర్హం.

​క్రిప్టోకరెన్సీపై పలు కంపెనీల దృష్టి..!
క్రిప్టోకరెన్సీపై భారతీయులు ఎక్కువ ఆదరణను చూపడంతో పలు ఫిన్‌టెక్‌  కంపెనీలు క్రిప్టోకరెన్సీపై పలు ఇన్వెస్టర్లకు థర్డ్‌పార్టీ వెండర్‌గా ఉండేందుకు సమయాత్తం అయ్యాయి. ఇప్పటికే కాయిన్స్‌స్విచ్‌, వజీర్‌ఎక్స్‌, కాయిన్‌డీసీఎక్స్‌ వంటి కంపెనీలు క్రిప్టోకరెన్సీలో ఇన్వెస్ట్‌చేసేవారికి వారధిగా నిలుస్తున్నాయి. అంతేకాకుండా భారత ప్రజల్లో క్రిప్టోకరెన్సీపై మరింత అవగాహన కల్పించడం కోసం  పలు దిగ్గజ నటీనటులను బ్రాండ్‌ అంబాసిడర్స్‌గా నియమించుకుంటున్నాయి. 
చదవండి: 

బిగ్‌బీ ఆగయా..!
కాయిన్స్‌డీసీఎక్స్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ నియమితులయ్యారు. ఫేస్‌బుక్ సహ వ్యవస్థాపకుడు ఎడ్వర్డో సావెరిన్స్ బి క్యాపిటల్ గ్రూప్, ఇతర ఇన్వెస్టర్లతో సారథ్యం వహించిన సిరీస్-సి ఫండింగ్ రౌండ్‌లో కాయిన్‌డీసీఎక్స్‌ సుమారు 90 మిలియన్ డాలర్లను సేకరించి భారత తొలి క్రిప్టో యునికార్న్‌గా అవతరించింది. అమితాబ్‌ బచ్చన్‌ కొద్ది రోజుల క్రితమే వారి నాన్‌ ఫంగిబుల్‌ టోకెన్‌ను కూడా ప్రారంభించారు. అమితాబ్‌ రాకతో క్రిప్టోకరెన్సీపై భారత్‌లో మరింత అవగాహన వస్తోందని కాయిన్‌ డీసీఎక్స్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ సుమిత్‌ గుప్తా అభిప్రాయపడ్డారు.  
చదవండి: క్రిప్టో కరెన్సీ బ్యాన్‌.. చైనా కాదు కదా ఏదీ ఏం చేయలేవు

మరిన్ని వార్తలు