Ranveer Singh: కంపెనీల మధ్య పోటాపోటీ..! నిన్న అమితాబ్‌ బచ్చన్‌..నేడు రణ్‌వీర్‌సింగ్‌..!

9 Oct, 2021 17:09 IST|Sakshi

ప్రపంచవ్యాప్తంగా సంప్రాదాయ కరెన్సీ స్థానాల్లో పలు డిజిటల్‌ కరెన్సీలు(క్రిప్టోకరెన్సీలు) గణనీయమైన అభివృద్ధిని సాధిస్తున్నాయి. ప్రపంచదేశాల్లోని ఇతర దేశాలతో పోలిస్తే భారత్‌లోని ప్రజలు క్రిప్టోకరెన్సీలను భారీగా ఆదరిస్తున్నారు. క్రిప్టోకరెన్సీకు స్వీకరణలో భారత్‌ రెండో స్థానంలో నిలవడం గమనర్హం. క్రిప్టోకరెన్సీపై భారతీయులు ఎక్కువ ఆదరణను చూపడంతో పలు ఫిన్‌టెక్‌ కంపెనీలు క్రిప్టోకరెన్సీపై అవగాహన కల్పించేందుకు గాను కాయిన్‌స్విచ్‌, వజీర్‌ఎక్స్‌, కాయిన్‌ డీసీఎక్స్‌ వంటి కంపెనీలు సమయాత్తమయ్యాయి. 
చదవండి: అమెజాన్‌ ప్రైమ్‌ యూజర్లకు గుడ్‌న్యూస్‌...!

నిన్న అమితాబ్‌ బచ్చన్‌..నేడు రణ్‌వీర్‌సింగ్‌..!
భారత్‌లో క్రిప్టోకరెన్సీపై ఆదరణను మరింత క్యాష్‌ చేసుకునేందుకు పలు కంపెనీలు సిద్దమైనాయి. కొద్ది రోజుల క్రితం  బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ ను కాయిన్‌ డీసీఎక్స్‌ అంబాసిడర్‌గా నియమించుకున్న విషయం తెలిసిందే. తాజాగా మరో భారత క్రిప్టోకరెన్సీ ట్రేడింగ్‌ ప్లాట్‌ఫాం కంపెనీ కాయిన్‌స్విచ్‌ కుబేర్‌ రణ్‌వీర్‌సింగ్‌ను బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమించుకుంది.

కొద్ది రోజుల క్రితమే కాయిన్‌స్విచ్‌ కుబేర్‌ యూనికార్న్‌ క్లబ్‌లో జాయిన్‌ అయ్యింది. కంపెనీ వాల్యూయేషన్‌ సుమారు 1.9 బిలియన్‌ డాలర్లకు చేరుకుంది. క్రిప్టోకరెన్సీ విషయంలో కాయిన్‌ స్విచ్‌ రణ్‌వీర్‌సింగ్‌తో మూడు యాడ్స్‌ను రూపోందించనున్నట్లు తెలుస్తోంది. కాయిన్‌స్విచ్‌ కుబేర్‌ ‘కుచ్‌ తో బద్‌లేగా..’ క్యాంపెయిన్‌తో టైర్‌-2, టైర్‌-3 నగరాల్లో క్రిప్టోకరెన్సీపై అవగాహన కల్పించాలని కంపెనీ భావిస్తోంది. అంతేకాకుండా క్రిప్టోకరెన్సీపై ఇన్వెస్ట్‌మెంట్‌ చేసేలా ప్రోత‍్సహించనుంది.
చదవండి: అదిరిందయ్యా ముఖేశ్‌ అంబానీ.. ! జెప్‌బెజోస్‌, ఎలన్‌ మస్క్‌తో పాటు..

మరిన్ని వార్తలు