MG Motor: ఆ స్మార్ట్‌ ఈవీ పేరు ‘కామెట్‌’... రేసింగ్‌ విమానం స్ఫూర్తితో...

2 Mar, 2023 15:30 IST|Sakshi

ప్రముఖ ఆటోమేకర్ ఎంజీ మోటర్స్‌ త్వరలో భారత్‌లో విడుదల చేయనున్న కొత్త ఎలక్ట్రిక్ వాహనానికి పేరును ప్రకటించింది. తమ స్మార్ట్ ఈవీకి 'కామెట్'గా పేరు పెట్టినట్లు పేర్కొంది. ఇంగ్లండ్-ఆస్ట్రేలియా మాక్‌రాబర్ట్‌సన్ ఎయిర్ రేస్‌లో పాల్గొన్న 1934 నాటి బ్రిటిష్ విమానం స్ఫూర్తితో ఈ పేరు పెట్టినట్లు వివరించింది. 

ఎంజీ మోటర్స్‌ ఇటీవల విడుదల చేసిన హెక్టర్ వంటి వాహనాలకు 1930 ప్రాంతంలో తయారు చేసిన రెండవ ప్రపంచ యుద్ధం నాటి యుద్ధ విమానం పేరు పెట్టారు. అదే విధంగా గ్లోస్టర్‌కు బ్రిటన్‌లో తయారు చేసి 1941లో ప్రయోగించిన  జెట్-ఇంజిన్ విమానం పేరు పెట్టారు.

త్వరలో రాబోతున్న కామెట్ ఈవీ రద్దీగా ఉండే పట్టణాలు, నగరాలకు చక్కగా సరిపోతుందని కంపెనీ పేర్కొంటోంది. ఇంధన ఖర్చులు, తక్కువ పార్కింగ్ స్థలాలు, పెరుగుతున్న కాలుష్యం నేపథ్యంలో ఈ ఎలక్ట్రిక్ వాహనాలు పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించడంలో సహాయపడతాయని, ఖర్చులను ఆదా చేస్తాయని చెబుతోంది.

(ఇదీ చదవండి: Realme GT3: మార్కెట్‌లోకి ఫాస్ట్‌ ఛార్జింగ్‌ ఫోన్‌.. ధర మాత్రం...) 

అర్బన్ మొబిలిటీ అనేది ప్రస్తుతం ఎదురవుతున్న కీలక సవాలని, దీంతో పాటు రాబోయే సవాళ్లను ఎదుర్కోవడానికి సరికొత్త పరిష్కారాలు కావాలని ఎంజీ మోటార్ ఇండియా ప్రెసిడెంట్, మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ చాబా పేర్కొన్నారు. డిజిటల్ యుగంలోకి మరింత ముందుకు వెళుతున్నకొద్దీ కొత్త కొత్త ఆవిష్కరణలు, టెక్నాలజీలను చూస్తామన్నారు. అందులో భాగంగానే ‘కామెట్‌’ను తీసుకొస్తున్నట్లు తెలిపారు.

(ఇదీ చదవండి: ఆ నగరాల్లో చుక్కలనంటిన రియల్‌ ఎస్టేట్‌ ధరలు! రూ. 8 కోట్లకు ఎంత వస్తుందంటే..)

మరిన్ని వార్తలు