రూ.15 లక్షలలో రాబోతున్న టాప్ ఎలక్ట్రిక్ కార్లు ఇవే! మీరు ఓ లుక్కేయండి!

13 Oct, 2021 15:34 IST|Sakshi

ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల చూస్తే.. సామాన్యుడు బయటకి వెళ్లాలంటే బయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. పెట్రోల్, డీజిల్ ధరల ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇలాంటి సందర్భంలో ఎలక్ట్రిక్ వాహన కంపెనీలు తమకు వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకుంటున్నాయి. నిన్న, మొన్న మొన్నటి వరకు ఎలక్ట్రిక్ వాహనాలు అంటే.. అమ్మో అనే ప్రజలు నేడు వాటి కొనుగోళ్లవైపు ఆసక్తి కనబరుస్తున్నారు. అలాగే, కాలం కలిసి రావడం వల్ల ఎలక్ట్రిక్ వాహన ధరలు కూడా భారీగా తగ్గుతున్నాయి.

ఇప్పటికే మార్కెట్లో ఎలక్ట్రిక్ స్కూటర్లు, ఎలక్ట్రిక్ బైక్స్, ఎలక్ట్రిక్ కార్లు సందడి చేస్తున్నాయి. పెద్ద పెద్ద కంపెనీలు సైతం ఎలక్ట్రిక్ వాహనాల తయారీపై దృష్టి పెట్టాయి. అందుకే, త్వరలో రూ.15 లక్షల లోపు రాబోయే కార్ల గురుంచి ఒకసారి మనం కూడా తెలుసుకుందాం..

1. టాటా టియాగో ఈవీ
భారతదేశంలో టాటా మోటార్స్ ఎలక్ట్రిక్ కార్ల తయారీ పోర్ట్ ఫోలియోను విస్తరిస్తుంది. అందులో భాగంగానే భవిష్యత్‌లో లాంచ్ చేయబోయే ఎలక్ట్రిక్ కార్లలో టియాగో హ్యాచ్ బ్యాక్ కారు ఒకటి అని సమాచారం. టాటా టియాగో గురుంచి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కొన్ని మార్పులతో మినహా అదేవిధంగా టాటా టియాగో ఎలక్ట్రిక్ కారును త్వరలో మార్కెట్లోకి తీసుకొని రావాలని చూస్తుంది. దీని ధర ₹6.5 లక్షలకు సమీపంలో ఉంటుందని అంచనా.(చదవండి: పాక్‌ జిమ్మిక్కు.. తాలిబన్లకే టోకరా!)

2. టాటా ఆల్ట్రోజ్ ఈవీ
ఆల్ట్రోజ్ హ్యాచ్ బ్యాక్ ఎలక్ట్రిక్ కారును ఈ ఏడాది చివరలో తీసుకొనిరావాలి చూస్తున్నట్లు సమాచారం. అయితే, రాబోయే ఈవి స్పెసిఫికేషన్లను కంపెనీ ఇంకా వెల్లడించలేదు. ఏదేమైనా, టాటా ఆల్ట్రోజ్ ఈవి కూడా కంపెనీ జిప్ట్రాన్ పవర్ ట్రైన్ టెక్నాలజీతో రావచ్చు అని చెప్పవచ్చు. ఈ రాబోయే ఈవి బ్యాటరీ 250 కిలోమీటర్ల నుంచి 300 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుందని కంపెనీ గతంలో తెలిపింది. టాటా ఆల్ట్రోజ్ ఈవీ ధర ₹10.5 లక్షల నుంచి ₹12.5 లక్షల వరకు ఉంటుందని అంచనా.(చదవండి: బిగ్‌ ‘సి’ దసరా పండుగ ఆఫర్లు)

3. మహీంద్రా ఈకెయువి100
ఆటో ఎక్స్ పో 2020 గుర్తుందా? ఈ ఎక్స్ పోలో మహీంద్రా ఈకెయువి100 ధరను వెల్లడించింది. ఆ సమయంలో మహీంద్రా & మహీంద్రా ఈకెయువి100 ధర ₹8.25 లక్షల(ఎక్స్ షోరూమ్) నుంచి ప్రారంభమవుతుందని తెలిపింది. త్వరలో రాబోయే మహీంద్రా ఈకెయువి100 లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్, 54 బిహెచ్‌పి, 120 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేసే ఎలక్ట్రిక్ మోటార్తో రానుంది. మహీంద్రా ఈకెయువి100 సింగిల్ ఛార్జ్ పై 147 కిలోమీటర్ల డ్రైవింగ్ రేంజ్ కలిగి ఉంటుంది. దీనిని ఒక గంటలో 80 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చు.(చదవండి: ఇక తగ్గేదె లే అంటున్న టాటా మోటార్స్!)

4. మహీంద్రా ఈఎక్స్ యువి300
వచ్చే సంవత్సరంలోగా మనం చూడబోయే మరో మహీంద్రా ఈవీ కారు మహీంద్రా ఈఎక్స్‌యువి300. దీనిని కూడా ఆటో ఎక్స్ పో 2020లో ప్రదర్శించారు. ఈఎక్స్‌యువి300 ఎలక్ట్రిక్ రెండు బ్యాటరీ ఆప్షన్లతో రానుంది. చిన్న బ్యాటరీ మోడల్ ఛార్జ్ చేస్తే సుమారు 300 కిలోమీటర్ల డ్రైవింగ్ వెళ్లనుంది. అలాగే, మహీంద్రా ఈఎక్స్ యువి300 లాంగ్ రేంజ్ మోడల్ ఛార్జ్ చేసిన ప్రతిసారీ సుమారు 400 కిలోమీటర్ల డ్రైవింగ్ రేంజ్ కలిగి ఉంటుంది. భారతదేశంలో మహీంద్రా ఈఎక్స్ యువి300 కారు ధరలు సుమారు ₹12.5 లక్షల వద్ద ప్రారంభమవుతాయని అంచనా.

మరిన్ని వార్తలు