టాటా చేతికే ఎయిరిండియా..! సీసీఐ గ్రీన్‌ సిగ్నల్‌

21 Dec, 2021 07:46 IST|Sakshi

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియాను పారిశ్రామిక దిగ్గజం టాటా గ్రూప్‌ కొనుగోలు చేసే ప్రతిపాదనకు కాంపిటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ) ఆమోదం లభించింది. సోమవారం ఒక అధికారిక ప్రకటనలో సీసీఐ ఈ విషయం పేర్కొంది. 

ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న ఎయిరిండియాను టాటా గ్రూప్‌ సంస్థ టాలేస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ .. వేలంలో రూ. 18,000 కోట్లకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఒప్పందంలో భాగంగా ఎయిరిండియా, ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌లో 100 శాతం వాటాలు, ఎయిరిండియా ఎస్‌ఏటీఎస్‌ ఎయిర్‌పోర్ట్‌ సర్వీసెస్‌ (ఏఐఎస్‌ఏటీఎస్‌)లో 50 శాతం వాటాలను టాలేస్‌ కొనుగోలు చేస్తోంది. దీని ప్రకారం రూ. 2,700 కోట్ల మొత్తాన్ని నగదు రూపంలో చెల్లించి, మరో రూ. 15,300 కోట్ల రుణాన్ని టేకోవర్‌ చేస్తుంది. 

చదవండి: ఆ మహానుభావుడు ఉంటే ఎంతో సంతోషించేవాడు.. ఎమోషనలైన రతన్‌ టాటా

మరిన్ని వార్తలు