వాట్సాప్‌ ప్రైవసీ పాలసీపై సీసీఐ విచారణ

25 Mar, 2021 00:27 IST|Sakshi

న్యూఢిల్లీ: మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌ తాజాగా అప్‌డేట్‌ చేస్తున్న ప్రైవసీ విధానంపై క్షుణ్నంగా విచారణ జరపాల్సిందిగా కాంపిటీషన్‌ కమిషన్‌ (సీసీఐ) తమ దర్యాప్తు విభాగం డైరెక్టర్‌ జనరల్‌ను ఆదేశించింది. 60 రోజుల్లోగా విచారణ పూర్తి చేసి, నివేదిక సమర్పించాలని సూచించింది. వాట్సాప్‌ అప్‌డేట్‌ పాలసీపై మీడియా వార్తల ఆధారంగా సుమోటో ప్రాతిపదికన విచారణ చేపట్టిన సీసీఐ ఈ మేరకు ఆదేశాలు ఇచ్చింది. వాట్సాప్‌ తీరు .. పోటీ చట్టాల నిబంధనలను ఉల్లంఘించేదిగాను, పాలసీ అప్‌డేట్‌ ముసుగులో దోపిడీ ధోరణిలో వ్యవహరిస్తున్నట్లుగాను ఉందని సీసీఐ ఆక్షేపించింది. వాట్సాప్‌ వినియోగించుకోవడాన్ని కొనసాగించాలంటే .. దాని మాతృ సంస్థ ఫేస్‌బుక్‌లో భాగమైన ఇతర కంపెనీలతో డేటాను పంచుకునే విధంగా యూజర్లు తప్పనిసరిగా కొత్త పాలసీకి అంగీకరించి తీరాల్సిందే అన్న నిబంధన సరికాదని పేర్కొంది. దీనికి సహేతుకమైన కారణాలేమీ కనిపించడం లేదని సీసీఐ అభిప్రాయపడింది. 

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు