మార్క్‌ జుకర్‌బర్గ్‌ నువ్వు ఏం చేస్తున్నావ్‌? ఫేస్‌బుక్‌పై ఫైర్‌!

12 Nov, 2021 20:22 IST|Sakshi

కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం తన రాజకీయ లబ్ధి కోసం ఫేస్‌బుక్, వాట్సాప్‌ల ద్వారా విషప్రచారం చేస్తోందని కాంగ్రెస్‌ పార్టీ మండిపడింది. కొత్త చట్టాల పేరు చెప్పి సోషల్‌ మీడియా దిగ్గజ కంపెనీలను ఒత్తిడి పెంచి విద్వేష పూరిత ప్రచారం చేస్తోందని ఆరోపించింది. ఈ విషయంపై జాయింట్‌ పార్లమెంటరీ కమిటీతో విచారణ చేపట్టాలని డిమాండ్‌ చేసింది. ఈ మేరకు ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏఐసీసీ టెక్నాలజీ సెల్‌ చీఫ్‌ ప్రవీణ్‌ చక్రవర్తి, రోహన్‌గుప్తాలు మాట్లాడారు.

ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజస్వామ్యానికి ఫేస్‌బుక్‌ కారణంగా ముప్పు ఏర్పడుతోందని కాంగ్రెస్‌ నేతలు విమర్షించారు. ఫేస్‌బుక్‌, వాట్సాప్‌ వేదికగా విష ప్రచారం జరుగుతుంటే ఎందుకు అడ్డుకోవడం లేదంటూ మార్క్‌ జూకర్‌బర్గ్‌ను ప్రశ్నించారు. విద్వేష పూరిత కంటెంట్‌ను గుర్తించి, వడపోసే కార్యక్రమానికి ఎందుకు బడ్జెట్‌ తగ్గిస్తూ వస్తున్నారని మార్క్‌ను అడిగారు. ఫేస్‌బుక్‌, వాట్సాప్‌లలో జరుగుతున్న ద్వేష పూరిత ఫేక్‌ న్యూస్ ప్రచారంపై అంతర్గత విచారణ చేపట్టాలని కోరుతూ మార్క్‌ జుకర్‌బర్గ్‌కి లేఖ రాశామన్నారు. 

ఫేస్‌బుక్‌ యూజర్లు తమ జీవితకాలంలో చేసే మరణించిన వ్యక్తుల చిత్రాల కంటే ఎక్కువ పుల్వామా ఎటాక్‌ మృతుల చిత్రాలను ఫేస్‌బుక్‌లో చూశారంటూ ఆరోపించారు. వాట్సాప్‌లో కూడా ఇదే జరగుతోందన్నారను. బీజేపీ ఉద్దేశ పూర్వకంగానే సోషల్‌ మీడియా ఫ్లాట్‌ఫామ్‌లను ఉపయోగించుకుని దేశంలో ద్వేషం పెంచుతుందన్నారు. దీనిపై జాయింట్‌ పార్లమెంటరీ కమిటీ చేత విచారణ జరిపించాలన్నారు.

>
మరిన్ని వార్తలు