వినియోగదారులకు భారీ షాక్‌, వీటి ధరలు పెరగనున్నాయ్‌

11 Jan, 2022 16:15 IST|Sakshi

వినియోగదారులకు గృహోపకరణ సంస్థలు భారీ షాకివవ్వనున్నాయి. జనవరి ఫెస్టివల్‌ సీజన్‌ నుంచి మార్చి ఈ మూడు నెలల మధ్య కాలంలో ఫ్రిజ్‌, ఏసీల ధరలు భారీగా పెంచనున్నాయి. 

కన్జ్యూమర్‌ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ అప్లయన్ సెస్‌ మ్యానుఫ్యాక్చర్‌ అసోసియేషన్‌ (సీఈఏఎంఏ) ప్రకారం..ముడి సరకుతో పాటు సరుకు రవాణా పెరగడంతో కన్జ్యూమర్‌ డ్యూరబుల్‌ ఐటమ్స్‌ను 5 నుంచి 10 శాతం వరకు పెంచేందుకు ఆయా కంపెనీలు వస్తువుల ధరల్ని పెంచేందుకు సిద్ధమయ్యాయి. 

కమోడిటీస్, గ్లోబల్ ఫ్రైట్, ముడి సరుకు పెరుగుదలతో రిఫ్రిజిరేటర్, వాషింగ్ మెషీన్లు, ఎయిర్ కండీషనర్ కేటగిరీలలో ఉత్పత్తుల ధరలను 3 నుండి 5 శాతం వరకు పెంచడానికి చర్యలు తీసుకున్నామని హైయర్ అప్లయన్సెస్ ఇండియా ప్రెసిడెంట్ సతీష్ తెలిపారు. ఇప్పటికే ఏసీల ధరలను 8శాతం వరకు పెంచిన పానాసోనిక్, మరింత పెంచే ఆలోచనలో ఉందని, అందుకే గృహోపకరణాల ధరల పెంచేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. 

ఎయిర్ కండీషనర్లు ఇప్పటికే దాదాపు 8 శాతం పెరిగాయి.పెరుగుతున్న వస్తువులు, సప్లయ్‌ చైన్‌ ధరల్ని బట్టి వస్తువుల ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని, గృహోపకరణాల ధరల పెరగొచ్చని పానాసోనిక్ ఇండియా డివిజనల్ డైరెక్టర్, కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ ఫుమియాసు ఫుజిమోరి అన్నారు. కాగా, భారత్‌లో రూ.75 వేల కోట్లున్న ఇండియన్‌ అప్లయన్స్‌ మార్కెట్‌ కోవిడ్‌ కారణంగా తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటుంది. లాక్‌డౌన్‌, చిప్‌ కొరతతో పాటు ఉత్పత్తులు తగ్గి పోవడం,అదే సమయంలో డిమాండ్‌లు పెరగడంతో పలు కంపెనీలు వస్తువుల ధరల్ని పెంచేందుకు సిద్ధమయ్యాయి.   

చదవండి: 2022 జనవరి 1 నుంచి  పెరిగే, తగ్గే  వస్తువుల జాబితా ఇదే..!

మరిన్ని వార్తలు