Contempt Case Against Vijay Mallya: విజయ మాల్యా కేసులో కీలక మలుపు..!

30 Nov, 2021 16:00 IST|Sakshi

సుమారు 9 వేల కోట్లను బ్యాంకులకు ఎగొట్టి బ్రిటన్‌కు పారిపోయినా కింగ్‌ఫిషర్‌ అధినేత విజయ మాల్యా కోర్టు ధిక్కరణ కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. విజయ్ మాల్యాను బ్రిటన్ నుంచి రప్పించేందుకు ఇక వేచి ఉండలేమని సుప్రీంకోర్టు మంగళవారం పేర్కొంది. మాల్యాకు విధించే శిక్షను  వచ్చే ఏడాది  జనవరి 18న ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది.

కోర్టు ఆదేశాలను ఉల్లంఘించి మాల్యా తన పిల్లలకు 40 మిలియన్ డాలర్లు బదిలీ చేసి కోర్టు ధిక్కారానికి పాల్పడ్డారు. 2017లో కోర్టును ధిక్కరించారని కోర్టు గుర్తించింది. ధిక్కరణలో భాగంగా గత నాలుగు నెలల నుంచి శిక్ష ఖరారు మాత్రమే పెండింగ్‌లో ఉంది.  

యూకే నుంచి మాల్యాను భారత్‌కు రప్పించే అంశం తుది అంకానికి చేరుకుందని కేంద్రం కోర్టుకు తెలిపింది . కాగా విజయ మాల్యా ఇండియాకు వచ్చే విషయంపై స్పష్టత లేదు. దీంతో విజయ మాల్యా కోర్టు ధిక్కార కేసును జనవరి 18న విచారిస్తామని అత్యున్నత న్యాయస్థానం తెలిపింది. జస్టిస్ యుయు లలిత్ నేతృత్వంలోని ధర్మాసనం మాల్యా వ్యక్తిగతంగా హాజరుకావాలని లేదా అతని న్యాయవాది ద్వారా వాదనలను వినిపించాలని కోరింది.

ధిక్కార నేరంపై సమీక్ష..!
కోర్టు ఆదేశాలను ఉల్లంఘించి విజయ్‌ మాల్యా తన పిల్లలకు 40 మిలియన్ డాలర్లు బదిలీ చేసినందుకు ధిక్కార నేరం కింద 2017 మేలో కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సమీక్షించాలని కోరుతూ  సుప్రీంకోర్టు పిటషన్‌ వేశాడు. కాగా పిటిషన్‌ను సుప్రీంకోర్టు గతంలో తోసిపుచ్చింది. అంతేకాకుండా కోర్టు ధిక్కారణ కేసులో కోర్టు ముందు హాజరు కావాలని పేర్కొంది. 
చదవండి: ఇది మరో ప్యాండెమిక్‌.. ఇండియన్‌ సీఈవో వైరస్‌.. వ్యాక్సిన్‌ కూడా లేదు

మరిన్ని వార్తలు