ఈ కంపెనీ షేర్లు కొన్నవారి జాతకం 3 నెలల్లో మారిపోయింది

24 Sep, 2021 21:16 IST|Sakshi

భవిష్యత్తు బాగుండాలంటే మనం సంపాదించిన సంపదలో మన ఖర్చులు పోగా మిగిలిన సంపదను పెట్టుబడిగా పెట్టడం ఉత్తమం అని పెద్దలు చెబుతుంటారు. ఈ పెట్టుబడి అనేది స్థిరాస్తి, బ్యాంకు డిపాజిట్లు, వడ్డీ ఆదాయం, అద్దె ఆదాయం, షేర్స్, మ్యూచువల్ ఫండ్స్, బాండ్స్, సేవింగ్ సర్టిఫికేట్లు, వివిధ పోస్ట్ ఆఫీసు ఫథకాలు, బంగారం మొదలగు వాటిలో పెట్టవచ్చు.

అయితే పెట్టుబడి వెనుక ప్రధాన ఉద్దేశం సంపద సృష్టించడం. పెట్టుబడి పెట్టడం వల్ల వచ్చే డబ్బుతో పిల్లల కళాశాల ఫీజులు, పెళ్ళిల్లు, సెలవులలో సరదాగా గడపడం, రిటైర్మెంట్ తర్వాత జీవితం సాపీగా జరిగిపోతుంది. అయితే, ఈ పెట్టుబడి వల్ల వచ్చే రాబడి పెరుగుతున్న ద్రవ్యోల్బణం కంటే అధికంగా ఉండాలి. ఎప్పుడైనా సరే సంపద ఎంత జాగ్రత్తగా సంపాదిస్తున్నామో అదేవిధంగా ఎందులో మనం పెట్టుబడి పెడుతున్నాం అనేది కూడా ముఖ్యం. అలాగే, డబ్బును కాపాడటం, అభివృద్ధి చేయడం అనేది ఒక ప్రత్యేక కళగా చెప్పుకోవాలి.(చదవండి: అమెజాన్‌ గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌ సేల్‌లో బంపర్ ఆఫర్లు)

ప్రస్తుతం ప్రజలకు అందుబాటులో వాటిలో వేగంగా రాబడి ఇచ్చేదీ ఏమైనా ఉంది అంటే? అది షేర్ మార్కెట్/ స్టాక్ మార్కెట్ అని చెప్పుకోవాలి. అయితే, స్టాక్ మార్కెట్ మీద పూర్తి జ్ఞానం ఉన్న వాళ్లు అధిక లాభాలు గడిస్తారు. అందుకే, రాకేశ్ జున్‌జున్‌వాలా వంటి వారు కోట్లలో సంపదిస్తారు. స్టాక్ మార్కెట్ మీద పూర్తి అవగాహన వచ్చాక మాత్రమే ఇందులో పెట్టుబడి పెట్టాలని నిపుణులు చెబుతుంటారు. స్టాక్ మార్కెట్ ఎంత లాభమో ఒక కంపెనీ షేర్ విలువ చూస్తే మీకే తెలుస్తుంది. కాంటినెంటల్ కెమికల్స్ అనే కంపెనీ స్టాక్ ధర కేవలం మూడు నెలల్లో దాదాపు 1,500% రాబడిని అందించింది. (చదవండి: ఔరా.. అద్దాలలో ఈ స్మార్ట్‌ అద్దాలు వేరయా!)

ఈ ఏడాది జూన్ 24, 2021న రూ.21.49గా ఉన్న షేర్ విలువ నేడు రూ.343.5కు పెరిగింది. అంటే, గత మూడు నెలల్లో 1,497.25% రిటర్న్లు ఇచ్చింది. మీకు ఉదాహరణగా చెప్పాలంటే మీరు గనుక జూన్ 24 రూ.1 లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టి ఉంటే అది నేడు రూ.15.98 లక్షలగా మారేది. అందుకే అంటారు చాలా మంది నిపుణులు ఒక్క రోజులో కోటీశ్వరుడు కావాలంటే షేర్ మార్కెట్ మాత్రమే అని. కానీ ఒక విషయం మాత్రం గుర్తు పెట్టుకోండి. అర కొర జ్ఞానంతో పెట్టుబడులు పెడితే ఎక్కువ శాతం నష్టాలు వచ్చే అవకాశం ఉంది. అందుకే మీరు మార్కెట్ మీద పూర్తి జ్ఞానం సంపాదించకే చిన్న చిన్న అడుగులతో మీ ప్రస్థానాన్ని ప్రారంభించండి.

మరిన్ని వార్తలు