కేబుల్‌ ఆపరేటర్లు, బ్రాడ్‌కాస్టర్స్‌ మధ్య ముగిసిన వివాదం 

25 Feb, 2023 04:46 IST|Sakshi

కొత్త ఒప్పందాలకు ఆపరేటర్లు ఓకే; 

కనెక్షన్ల పునరుద్ధరణ

న్యూఢిల్లీ: కొత్త టారిఫ్‌ ఆర్డరుపై (ఎన్‌టీవో) బ్రాడ్‌కాస్టర్లు, లోకల్‌ కేబుల్‌/మల్టీ సిస్టమ్‌ ఆపరేటర్స్‌ మధ్య వివాదం మొత్తానికి ఓ కొలిక్కి వచ్చింది. కొత్త ఒప్పందాలపై సంతకాలు చేసేందుకు ఆపరేటర్లు అంగీకరించారు. దీంతో బ్రాడ్‌కాస్టర్లు శుక్రవారం తిరిగి చానల్స్‌ కనెక్షన్లను పునరుద్ధరించినట్లు పరిశ్రమ వర్గాలు తెలిపాయి.

రేట్లను పెంచుతూ రూపొందించిన ఒప్పందాలను కుదుర్చుకోని కేబుల్‌ ఆపరేటర్లకు డిస్నీ స్టార్, జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఎంటర్‌ప్రైజెస్, సోనీ పిక్చర్స్‌ నెట్‌వర్క్స్‌ ఇండియా ఫీడ్‌ను నిలిపివేసిన సంగతి తెలిసిందే. కొత్త ఎన్‌టీవో ఫిబ్రవరి నుంచి అమల్లోకి వచ్చింది.

అంతక్రితమే ఫిబ్రవరి 15లోగా కొత్త ఒప్పందంపై సంతకాలు చేయాల్సిందిగా బ్రాడ్‌కాస్టర్స్‌ నోటీసులు ఇచ్చారు. కానీ ఆలిండియా రేట్లను 18–35 శాతం మేర పెంచేశాయంటూ డిజిటల్‌ కేబుల్‌ ఫెడరేషన్‌ (ఏఐడీసీఎఫ్‌) సభ్యులు నిరాకరించడంతో బ్రాడ్‌కాస్టర్లు సిగ్నల్స్‌ను నిలిపివేశాయి. 

మరిన్ని వార్తలు