పాత కార్లను ఎలక్ట్రిక్ కార్లుగా మారిస్తే ఎంత ఖర్చవుతుందో తెలుసా?

25 Nov, 2021 14:14 IST|Sakshi

Convert Diesel And Petrol Car To Electric Car: ఢిల్లీ ప్రభుత్వం ఆటోమొబైల్‌ రంగం విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. పాత డీజిల్‌ వెహికల్స్‌ను ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌గా మార్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ఇందుకోసం ఎలక్ట్రిక్ కిట్‌లను తయారు చేసే సంస్థ ఢిల్లీ రవాణా శాఖ ఒప్పందం కుదుర్చుకోనుందని  ఢిల్లీ రవాణా మంత్రి కైలాష్ గహ్లోట్ తెలిపారు.

2015లో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్, 2018లో సుప్రీంకోర్టు 10 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ పాత డీజిల్ వాహనాలు,15 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ పాత పెట్రోల్ వాహనాలు ఢిల్లీ -ఎన్సీఆర్‌ (National Capital Region) లో నడపరాదని ఆదేశించింది. ఈ తీర్పు కారణంగా ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లోని వినియోగదారులు తమ వాహనాల్ని మూలన పెట్టేశారు. అయితే ఇప్పుడు కేజ్రీవాల్‌ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఢిల్లీలోని 10 ఏళ్లకు పై బడిన పెట్రో వాహనాల యజమానులకు ఉపశమనం కలగనుంది. 

పాత కార్లను ఎలక్ట్రిక్ కార్లుగా మారిస్తే అయ్యే ఖర్చు
మనదేశంలో ఈవీ కన్వర్షన్‌ ఏజెన్సీలు ఉన్నాయి. వీటి ధర రూ.1లక్ష నుంచి రూ.4లక్షల వరకు ఉంటుంది. ఉదాహరణకు హైదరాబాద్‌కు చెందిన స్టార్టప్‌ ఈట్రియో ఇప్పటికే మారుతీ ఆల్టో,డిజైర్స్‌ వంటి పెట్రోల్‌ -డీజిల్‌ వాహనలను ఒకే ఛార్జ్‌పై 150 కిలోమీటర్ల వరకు బ్యాటరీ పరిధి కలిగిన ఎలక్ట్రిక్‌ వాహనాలుగా మారుస్తోంది. ఎలక్ట్రిక్‌ కన్వర్షన్‌ కిట్‌ ధర దాదాపు రూ.4లక్షలుగా ఉంది.  

2012లో బెంగళూరు కేంద్రంగా ఆల్టిగ్రీన్‌ సంస్థ పెట్రో వాహనాల్ని హైబ్రిడ్‌ వెర్షగా మార్చేస్తున్నాయి. ఆల్ట్రిగ్రీన్‌ హైబ్రిడ్‌ కిట్‌ ఇంజిన్‌ను అమర్చుతుంది. డ్యూయల్‌ ఎలక్ట్రిక్‌ మెషిన్‌, జనరేటర్‌, వైర్‌జీను,పవర్‌, కంట్రోల్‌ ఎలక్ట్రానిక్స్‌ తో పాటు 48వీ బ్యాటరీ ప్యాక్‌ 4లీడ్‌ యాసిడ్‌ బ్యాటరీలతో డిజైన్‌ చేస్తుంది. ఈ ప్లగ్‌ ఇన్‌ సిస్టమ్‌ ధర రూ.60వేల నుంచి రూ.80వేల మధ్య ఉంటుంది. 

ఢిల్లీకి చెందిన హైబ్రిడ్‌ ఎలక్ట్రిక్‌ రెట్రోఫిట్‌ కారు కంపెనీ ఏదైనా మాన్యువల్‌ గేర్‌ బాక్స్‌ ఇంజిన్‌ కారును రూ.1 నుంచి రూ.2లక్షలకు, తయారీతో పాటు మోడల్‌ ఆధారంగా హైబ్రిడ్‌గా మార్చేస్తుంది. అయితే ఈ కిట్ ధర రూ.5 లక్షల వరకు ఉండనుందని తెలుస్తోంది. మరి పాతకార్లపై భారీ మొత్తాన్ని వెచ్చించి వాటిని ఈవీ వెహికల్స్‌గా ఎందుకు మార్చుకుంటారనేది ప్రశ్నార్ధకంగా మారింది. పైగా కొత్త ఎలక్ట్రిక్‌ వెహికల్‌ను కొనుగోలు చేసినందుకు ఆయా ప్రభుత్వాలు రాయితీతోపాటు, ట్యాక్స్‌లో రాయితీ పొందవచ్చు.  

చదవండి: అరె డాల్ఫిన్‌లా ఉందే, వరల్డ్‌ ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌ రికార్డ్‌లను తుడిచి పెట్టింది

మరిన్ని వార్తలు