Cooking Oil Becomes Cheaper: వంట నూనె ధర తగ్గింపు, వెంటనే అమల్లోకి

8 Jul, 2022 17:22 IST|Sakshi

లీటరుపై 15 రూపాయలు తగ్గింపు 

సాక్షి, న్యూఢిల్లీ: వంటనూనెల ధరలను అదుపు చేసేందుకవసరమైన చర్యలు తీసుకుంటున్న కేంద్రం తాజాగా శుభవార్త అందించింది.  వంట నూనెల రిటైల్ ధరను లీటరుకు రూ. 15 తగ్గించింది. సవరించిన ధరలు తక్షణమే అమల్లోకి వస్తాయని సంబంధిత మంత్రిత్వశాఖ  శుక్రవారం ఒక నోటిఫికేషన్‌లో పేర్కొంది. 

ధర తగ్గింపు ప్రయోజనాలను వినియోగదారులకు తక్షణమే అందించాలని తయారీదారులు, రిఫైనరీలకు కేంద్ర ప్రభుత్వం సూచించింది.  దీంతో సామాన్యులకు వంటింటి  భారం నుంచి భారీ ఊరట లభించింది. అంతర్జాతీయ మార్కెట్‌లో రేట్లు దిగిరావడం, ఆయిల్ తయారీ కంపెనీలతో చర్చల నపథ్యంలో వంట నూనె ధరలు దిగి వచ్చాయి. కాగా వినియోగదారుల వ్యవహారాల శాఖ అందించిన సమాచారం ప్రకారం జూన్ 1 నుంచి దేశంలో ఆవ, పొద్దు తిరుగుడు, సోయాబీన్, పామాయిల్  రిటైల్ ధరలు 5-11 శాతం తగ్గాయి.

మరిన్ని వార్తలు