ఏసీ, రిఫ్రిజిరేటర్లకు ఫుల్ డీమాండ్

6 Apr, 2021 18:48 IST|Sakshi

భారతదేశంలోని చాలా ప్రాంతాలలో ఈ సంవత్సరం సాధారణ స్థాయి కంటే ఎండల తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నట్లు భారత వాతావరణ శాఖ(ఐఎమ్‌డీ) పేర్కొనడంతో శీతలీకరణ పరికర తయారీదారులు ఏసీ, రిఫ్రిజిరేటర్లకు ఫుల్ డీమాండ్ ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే వాతావరణంతో పాటు పెరుగుతున్న కరోనా కేసులు, వర్క్ హోమ్ చేసే వారి సంఖ్య పెరుగుతుండటంతో దేశంలో ఏసీ, రిఫ్రిజిరేటర్ల డిమాండ్‌ పెరిగే అవకాశం ఉంది. "గత 3-4 నెలలుగా ఎయిర్ కండీషనర్ల విభాగంలో 25 శాతం వృద్ధిని సాధించాము, ఇక ముందు కూడా ఇదే ధోరణి కొనసాగుతుందని ఆశిస్తున్నాము. ఈ ఏడాది క్యూ4 వరకు 100 శాతం కంటే ఎక్కువ వృద్ధిని నమోదు చేయాలనీ లక్ష్యంగా పెట్టుకున్నాము" అని పానాసోనిక్ ఇండియా ప్రెసిడెంట్ & సీఈఓ మనీష్ శర్మ పేర్కొన్నారు. 

ఈ డిమాండ్ ఎయిర్ కండిషనర్లు మాత్రమే పరిమితం కాకుండా పానాసోనిక్ రిఫ్రిజిరేటర్లలో 30 శాతం రికార్డు వృద్ధిని సాదించనున్నట్లు పేర్కొన్నారు. మునుపటి సంవత్సరాలకు భిన్నంగా ఈ ఏడాది దక్షిణ, పశ్చిమ రాష్ట్రాలలో అధిక డిమాండ్ ఉన్నట్లు వారు పేర్కొన్నారు. "ఈ వేసవి కాలంలో పట్టణ మినీ-మెట్రో నగరాలలో బ్రాండెడ్ గృహోపకరణాల వాడకం పెరిగే అవకాశం ఉన్నట్లు వారు పేర్కొన్నారు. మరి ముఖ్యంగా గ్రామీణ, టైర్ 2 & 3 నగరాల నుంచి డిమాండ్ పెరుగుతుంది" అని వోల్టాస్ ప్రతినిధి పేర్కొన్నారు. పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని పరికరాలను తయారు చేస్తున్నట్లు వోల్టాస్ పేర్కొంది.

చదవండి: 

చౌక వడ్డీకే హోమ్ లోన్ ఇస్తున్న బ్యాంకులు ఇవే!

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు