మరో దఫా ‘ఉద్దీపన’ చర్యలు: రాజీవ్‌ కుమార్‌

19 Apr, 2021 07:58 IST|Sakshi

మరింత అనిశ్చితి’ నెలకొనే అవకాశం: నీతి ఆయోగ్‌ వైస్‌ చైర్మన్‌ రాజీవ్‌ కుమార్‌

తగు సమయంలో ద్రవ్యపరమైన చర్యలు

సాక్షి, న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ సెకండ్‌ వేవ్‌ కారణంగా ఇటు వినియోగదారులు, అటు ఇన్వెస్టర్ల సెంటిమెంటుపరంగా ’మరింత అనిశ్చితి’  నెలకొనే అవకాశం ఉందని నీతి ఆయోగ్‌ వైస్‌ చైర్మన్‌ రాజీవ్‌ కుమార్‌ చెప్పారు. ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొనేందుకు దేశం సంసిద్ధంగా ఉండాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం తగు సమయంలో ద్రవ్యపరమైన చర్యలు తీసుకోగలదని కుమార్‌ పేర్కొన్నారు.

కరోనా వైరస్‌ కేసులు భారీగా పెరుగుతుండటంతో పరిస్థితి గతంలో కన్నా మరింత కష్టతరంగా మారిందని ఆయన తెలిపారు. అయినప్పటికీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశ ఎకానమీ 11 శాతం మేర వృద్ధి సాధించగలదని కుమార్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. కోవిడ్‌–19ని భారత్‌ దాదాపు తుదముట్టించే దశలో ఉండగా బ్రిటన్, ఇతర దేశాల నుంచి వచ్చిన కొత్త స్ట్రెయిన్స్‌ కారణంగా పరిస్థితి దిగజారిందని ఆయన పేర్కొ న్నారు. ‘సర్వీసులు వంటి కొన్ని రంగాలపై ప్రత్యక్ష ప్రభావం చూపడంతో పాటు వివిధ ఆర్థిక కార్యకలాపాలపైనా సెకండ్‌ వేవ్‌ పరోక్షంగా ప్రభావం చూపడం వల్ల ఆర్థిక పరిస్థితుల్లో అనిశ్చితి పెరగ వచ్చు. ఇలాంటి అనిశ్చితిని ఎదుర్కొనేందుకు మనం సిద్ధంగా ఉండాలి’ అన్నారు.   

మరిన్ని వార్తలు