రెండు నెలలు ఓపిక పట్టండి : సీరం సీఈఓ

27 Aug, 2020 18:13 IST|Sakshi

సాక్షి,ముంబై: కరనా వైరస్ ఉధృతి కొనసాగుతున్నతరుణంలో టీకా కోసం దేశమంతా ఉత్కంఠగా ఎదురు చూస్తోంది. మరోవైపు కోవిషీల్డ్ క్లినికల్ ట్రయల్స్ పై మధ్యంతర డేటాపై రిపోర్టు చేయొద్దంటూ ఫార్మా దిగ్గజం సీరం సంస్థ మీడియాను కోరింది. ఈ మేరకు సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈఓ అదార్ పూనవల్లా ట్విటర్ ద్వారా విజ్ఞప్తి చేశారు. క్లినికల్ ట్రయల్స్ రెండు నెలల్లో ముగిసిన అనంతరం సంబంధిత  డేటా మొత్తం త్వరలోనే అందుబాటులోకి వస్తుందని అప్పటిదాకా ఓపిక పట్టాలని పూనవల్లా  కోరారు.  (చదవండి కరోనా వ్యాక్సిన్ : సీరం గుడ్ న్యూస్ )

ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయం-ఆస్ట్రాజెనెకా కరోనా వైరస్  వ్యాక్సిన్‌ తయారీకి సీరం ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే.  కోవిషీల్డ్ క్లినికల్ ట్రయల్స్ పై రోగుల గురించి పూర్తి డేటా రాకముందే ఎలాంటి నివేదికలను ఇవ్వొద్దంటూ కోరారు. ఈ ప్రక్రియను గౌరవించాలని, పక్క దారి పట్టించవద్దంటూ ఆయన ట్వీట్ చేశారు.  పూర్తి  సమాచారం కోసం  రెండు నెలలు ఓపికగా  ఉండాలని  పేర్కొన్నారు.  కాగా డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) అనుమతి పొందిన అనంతరం కోవిడ్-19  వాక్సీన్ 3 వ దశ  క్లినికల్ ట్రయల్స్  సీరం సంస్థ ప్రారంభించింది.

మరిన్ని వార్తలు