చిన్న సంస్థలకు కేంద్రం గుడ్‌ న్యూస్‌!

16 Sep, 2022 13:55 IST|Sakshi

చిన్న సంస్థల విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. పెయిడ్ అప్ క్యాపిటల్, టర్నోవర్ థ్రెషోల్డ్‌లను ప్రభుత్వం సవరించింది. ఈ నిర్ణయం సంస్థలపై నిర్వాహణ భారం తగ్గడంలో సహాయ పడనుంది. 

కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వ్యాపార నిర్వహణను మరింత సౌలభ్యం చేసే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకుంది. తాజాగా కేంద్రం సవరించిన నిబంధనల మేరకు చిన్న సంస్థల చెల్లింపు మూలధనం (paid up capital) థ్రెషోల్డ్ గతంలో రూ. 2 కోట్లకు మించకూడదు అనే నిబంధన ఉంది. ఇప్పుడు దాన్ని సవరించి రూ. 4 కోట్లకు పెంచింది.
  
అదేవిధంగా, రూ. 20 కోట్ల టర్నోవర్‌ థ్రెషోల్డ్‌ను రూ.40 కోట్లకు మించకుండా సవరించినట్లు మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.ఈ సవరణలతో చిన్న కంపెనీల జాబితాలో మరిన్ని ఎంటిటీలు(సంస్థలకు) చేరనున్నాయి.  

మంత్రిత్వ శాఖ ప్రకారం..ఇకపై చిన్న కంపెనీలు ఫైనాన్షియల్ స్టేట్‌మెంట్‌లో భాగంగా క్యాష్ ఫ్లో స్టేట్‌మెంట్‌ను సిద్ధం చేయాల్సిన పనిలేదు. వార్షిక రిటర్న్‌ను ఫైల్ చేసుకోవచ్చు.  

చిన్న సంస్థలకు జరిమానాలు తక్కువగా పడనున్నాయి. అటువంటి సంస్థల వార్షిక రాబడిపై కంపెనీ సెక్రటరీ లేదా కంపెనీ సెక్రటరీ లేని చోట కంపెనీ డైరెక్టర్ సంతకం చేయడంతో పాటు ఇతర సౌకర్యాలు కలగనున్నాయి.

మరిన్ని వార్తలు