దేశీయ దగ్గు మందులపై కేంద్రం కీలక నిర్ణయం, త్వరలోనే అమల్లోకి

23 May, 2023 15:45 IST|Sakshi

ఇటీవలి ఆరోపణల  నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం

దగ్గు  సిరప్‌ల ఎగుమతులకు  అనుమతిని తప్పనిసరి

ప్రభుత్వ ల్యాబ్స్‌లో పరీక్షలు, ధృవీకరణ పత్రాలు

న్యూఢిల్లీ:  దేశీయ కాఫ్‌ సిరప్‌లపై ఇటీవలి ఆరోపణలు, వివాదాల నేపథ్యంలో కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. ద‌గ్గు మందు ఎగుమ‌తుల‌పై  కీల‌క నిబంధ‌న‌లు జారీ చేసింది. భారతీయ సంస్థలు ఎగుమతి చేసే దగ్గు మందుల (సిరప్‌)లపై అనుమతిని తప్పనిసరి చేసింది.  జూన్ 1వ తేదీ నుంచి  ఈ నిబంధనలు అమల్లోకి రానున్నాయని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (DGFT) ఒక నోటిఫికేషన్‌లో తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా నాణ్యతా పరమైన ఆందోళనలు తలెత్తిన తర్వాత ఈ  నిర్ణయం తీసుకుంది. 

ఇదీ చదవండి: అదానీ గ్రూపు ఇన్వెస్టర్‌ జాక్‌పాట్: మూడు నెలల్లో ఎన్ని వేల కోట్లో తెలిస్తే..!

ప్ర‌భుత్వ ల్యాబ్‌ల్లో త‌నిఖీ త‌ర్వాతే ఎగుమ‌తుల‌కు అనుమ‌తి ఇవ్వనున్నట్టు కేంద్రం తాజాగా ప్ర‌క‌టించింది. ప్ర‌భుత్వ ల్యాబుల్లో పరీక్షల అనంతరం మాత్రమే అనుమతి ఉంటుంది. ఆ యా ల్యాబ్స్‌ టెస్టింగ్‌ సంబంధించి ద‌గ్గు సిర‌ప్‌ల‌పై త‌ప్ప‌నిస‌రిగా ఓ ధృవీక‌ర‌ణ ప‌త్రాన్ని జారీ చేస్తాయి. ఎగుమతుల సమయంలో ఆ ధృవీక‌ర‌ణ ప‌త్రాన్ని త‌ప్ప‌నిస‌రిగా అధికారుల‌కు చూపించాల్సి ఉంటుంది. దేశం నుండి ఎగుమతి చేసే వివిధ ఔషధ ఉత్పత్తుల నాణ్యతకు భరోసా ఇవ్వడంలో తమ నిబద్ధతను తిరిగి నొక్కిచెప్పడానికి కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని  ప్రభుత్వ  అధికారి ఒకరు తెలిపారు.

ఇండియ‌న్ ఫార్మ‌కోపోయియా క‌మిష‌న్, ఆర్‌డీటీఎల్-చండీఘ‌ర్, సెంట్ర‌ల్ డ్ర‌గ్స్ ల్యాబ్-కోల్‌క‌తా, సెంట్ర‌ల్ డ్ర‌గ్ టెస్టింగ్ ల్యాబ్-చెన్నై, హైద‌రాబాద్, ముంబై, ఆర్‌డీటీఎల్- గువ‌హ‌టితో పాటు రాష్ట్ర ప్ర‌భుత్వాల‌చే గుర్తింపు పొందిన‌  ల్యాబ్‌ల్లో పరిక్షలకు అనుమతి.

కాగా ఈ ఏడాది ఫిబ్రవరిలో, తమిళనాడుకు చెందిన గ్లోబల్ ఫార్మా హెల్త్‌కేర్ ఐ డ్రాప్స్‌ను రీకాల్ చేసింది. గత సంవత్సరం గాంబియా, ఉజ్బెకిస్తాన్‌లలో వరుసగా 66, 18 మంది చిన్నారుల మరణాలకు భారతదేశంలో తయారు చేసిన దగ్గు సిరప్‌లు కారణమని ఆరోపణలు  సంచలనం రేపిన సంగతి తెలిసిందే. (Jeff Bezos-Lauren Sanchez: ఎట్టకేలకు గర్ల్‌ఫ్రెండ్‌తో అమెజాన్‌ ఫౌండర్‌ ఎంగేజ్‌మెంట్‌)

చదవండి: అన్నీ సాహసాలే: ఆరు నెలలకే వేల కోట్ల బిజినెస్‌!

మరిన్ని వార్తలు