కరోనా వేవ్‌: అతిపెద్ద డైమండ్ కంపెనీ మూత

6 Apr, 2021 09:10 IST|Sakshi

భారత్‌ డైమండ్‌ బౌర్స్‌ తాత్కాలిక మూత

సాక్షి, ముంబై:  మహారాష్ట్రలో కరోనా వైరస్‌ రెండోదశలో విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలో దేశంలో అతిపెద్ద డైమండ్ కంపెనీ ‘భారత్ డైమండ్ బోర్స్’  కీలక నిర్ణయం తీసుకుంది. నగరంలో పెరుగుతున్న  కరోనా వైరస్ కేసుల మధ్య కార్యకలాపాలను నిలిపివేయాలని నిర్ణయించింది. మహమ్మారి వ్యాప్తి కారణంగా మహారాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఆంక్షలు ప్రకటించిన తరువాత ఈ నిర్ణయం తీసుకున్నట్టు కంపెనీ ఒక ప్రకటనలో వెల్లడించింది.

తాజా ఈ నిర్ణయంతో వజ్రాల క్రయ, విక్రయాల్లో ప్రపంచంలో అతిపెద్ద వ్యాపార కేంద్రం అయిన భారత్‌ డైమండ్‌ బౌర్స్‌ కార్యకలాపాలు నిలిచిపోయాయి. దేశంలోని వజ్రాల ఎగుమతుల్లో 98 శాతం నిర్వహిస్తున్న ముంబైకి చెందిన ఈ కంపెనీలో సోమవారం రాత్రి 8 నుంచి తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు బంద్‌ కొనసాగనుంది. ముంబై బాంద్రాలోని బాంద్రా-కుర్లా కాంప్లెక్స్‌లో  భారత్‌ డైమండ్‌ బౌర్స్‌ ప్రధాన కేంద్రం ఉంది. కోవిడ్‌-19 కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం పరిమితుల  నేపథ్యంలోతన  కార్యకలాపాలకు తాత్కాలికంగా బ్రేక్‌ చెప్పింది.   కాగా ముంబైలో అత్యధికంగా 11,163 కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి. సోమవారం నాటికి  ఈ కేసుల 4,62,302గా ఉంది.

మరిన్ని వార్తలు