కోవీషీల్డ్‌ వ్యాక్సిన్‌ ధర : సీరం కీలక ప్రకటన

12 Jan, 2021 16:44 IST|Sakshi

మొట్టమొదటి కోవిడ్ -19 వ్యాక్సిన్  అందించడం చారిత్రక క్షణం : సీరం

మొదటి 100 మిలియన్ మోతాదులకు ధర రూ.200 

ప్రయివేటు ధర 1000

సాక్షి,ముంబై: మరికొన్ని రోజుల్లో దేశంలో కరోనా వ్యాక్సిన్‌ అందుబాటులోకి రానుంది. తొలిదశలో ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌కు, ఆ తరువాత క్రమంగా దేశ ప్రజలకు ఈ టీకాను అందించనున్నారు. ఈ నేపథ్యంలో కరోనా వ్యాక్సిన్ కోసం ప్రజలంతో ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. దీంతో  ఈక్రమంలో కోవిషీల్డ్ వ్యాక్సిన్ ధరపై సీరం  కీలక ప్రకటన చేసింది. దేశంలో తొలి కోవిడ్-19 వ్యాక్సిన్ అందించడం ఒక చారిత్రక క్షణం గురించి సీరం సీఈవో అదర్‌ పూనావాలా సంతోషం వ్యక్తం చేశారు. అలాగే భారత ప్రభుత్వ అభ్యర్థన మేరకు కోవిడ్-19 వ్యాక్సిన్‌ను కేంద్రం "ప్రత్యేక ధర" కు కొనుగోలు చేసినట్లు  పూనావాలా మంగళవారం ధృవీకరించారు. (సీరం, కేంద్రం డీల్‌ : రూ. 200కే వ్యాక్సిన్‌)

ప్రభుత్వ మెగా టీకా డ్రైవ్‌లో అందించే కోవిషైల్డ్ వ్యాక్సిన్ ధరపై స్పందించిన అదర్‌ పూనావాలా మొదటి 100 మిలియన్ మోతాదులకు మాత్రమే  200 రూపాయల ప్రత్యేక ధరకు అందించాం. ప్రధానంగా సామాన్యులకు, బలహీనంగా, పేదలకు, ఆరోగ్య కార్యకర్తలతోపాటు, ఇతర అణగారిన వర్గాలకు మద్దతు ఇవ్వడమే తమ లక్క్ష్యం.ఇందులో భాగంగా లభాపేక్ష లేకుండా తక్కువ ధరను నిర్ణయించామన్నారు. 100 మిలియన్ యూనిట్ల సరఫరా తర్వాత కూడా ప్రభుత్వానికి చాలా సహేతుకమైన ధరకే అందిస్తామని, అయితే ఇది రూ.200 కన్నా కొంచెం ఎక్కువే అవుతుందన్నారు. 

ఇక ప్రైవేట్ మార్కెట్లలో  రూ. 1000 విక్రయిస్తామని చెప్పారు. అలాగే ఈ ఏడాది చివరి నాటికి దేశంలోని ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్‌ను అందించడమే తమ ప్రధాన సవాల్‌ అని  పేర్కొన్నారు. వ్యాక్సిన్ ఉత్పత్తి గురించి ఆయన మాట్లాడుతూ  తాము ప్రతి నెలా 70-80 మిలియన్ మోతాదులను తయారుచేస్తామన్నారు. అలాగే విదేశీ దేశాలకు తమటీకాను అందించనున్నామని, ఇందుకు సంబంధించిన ప్రణాళికలు జరుగుతున్నాయన్నారు. పూణే విమానాశ్రయానికి ఆక్స్‌ఫర్డ్‌-ఆస్ట్రాజెనెకా కోవిడ్ వ్యాక్సిన్ తొలి లోడ్‌ను తీసుకెళ్తున్న మూడు ట్రక్కులు ఈ రోజు దేశవ్యాప్తంగా 13 ప్రదేశాలకు చేరుకోనున్నాయి. ఢిల్లీ, కర్నాల్, అహ్మదాబాద్, చండీగఢ్‌, లక్నో, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, విజయవాడ, భువనేశ్వర్, కోల్‌కతా, గౌహతి తదితరాలున్నాయి. జనవరి 16న దేశవ్యాప్త టీకా డ్రైవ్ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. 

మరిన్ని వార్తలు