పగిలిన డిస్‌ప్లే ఫో‍న్లకు ఐఐటీ పరిశోధకుల అద్భుత ఆవిష్కరణ

24 Jul, 2021 21:56 IST|Sakshi

స్మార్ట్‌ఫోన్‌ మన నిత్యజీవితంలో ఒక భాగమైంది. వేలకువేలు డబ్బులు పోసి మీరు స్మార్ట్‌ఫోన్‌ కొనుగోలు చేస్తే, ఒక్కసారిగా మీ ఫోన్‌ అనుకోకుండా కింద పడి డిస్‌ప్లే పగిలిపోతే అంతే సంగతులు...! గుండె బద్దలైపోతుంది. ఎంతోకొంత డబ్బును వెచ్చించి తిరిగి ఫోన్‌కు కొత్త డిస్‌ప్లే వేయిస్తాం..! మనలో చాలా మంది ఇలాంటి చేదు అనుభవాలను ఎదుర్కొన్న వారిమే. ఫోన్‌ పొరపాటున ఎక్కడ కింద పడిపోతదేమో అనే భయంతో మన ఫోన్లను జాగ్రత్తగా చూసుకుంటాం.

ఇకపై ఫోన్‌ కింద పడితే డిస్‌ప్లే పగిలిపోతుందన్న భయం వీడండి. ఎందుకంటే భవిష్యత్తులో స్మార్ట్‌ఫోన్‌ డిస్‌ప్లే పగిలితే స్క్రీన్‌ తనంతటతాను స్క్రీన్‌ మంచిగా కానుంది. ఈ అద్భుతమైన ఆవిష్కరణకు ఐఐటీ ఖరగ్‌పూర్‌, ఐఐఎస్‌ఈఆర్‌ కోల్‌కత్తా పరిశోధకులు పురుడుపోశారు. పగిలిన ఫోన్ల డిస్‌ప్లే దానంతటా అదే హీల్‌ అయ్యే టెక్నాలజీను కనుగొన్నారు. ఈ ఆవిష్కరణకు సంబంధించిన విషయాలను ‘ సేల్ఫ్‌ హీలింగ్‌ క్రిస్టలిన్‌ మెటిరియల్‌’ జర్నల్‌ పేపర్‌లో  పబ్లిష్‌ చేశారు.

ఈ బృందం స్పటికకార స్థితిలో ప్రత్యేక సాలిడ్‌ మెటిరియల్‌ను తయారుచేశారు. ఈ పదార్థం ఫీజోఎలక్ట్రిక్‌ ధర్మాన్ని కలిగి ఉంది. మెకానికల్‌ ఎనర్జీను ఎలక్ట్రిక్ ఎనర్జీగా కన్‌వర్ట్‌ చేయనుంది. ఈ పదార్థంలో ఏర్పడిన పగుళ్లలో ఉపరితలాల వద్ద వ్యతిరేక విద్యుత్ శక్తిని ప్రేరేపిస్తుంది. దీంతో  ఈ పదార్థం తిరిగి సెల్ఫ్‌ హీల్‌ అవ్వడానికి ప్రయత్నిస్తోంది.  ఈ ఆవిష్కరణతో డిస్‌ప్లే క్రాక్‌లకు చెక్‌ పెట్టవచ్చునని పరిశోధకులు భావిస్తున్నారు.

మరిన్ని వార్తలు