సీఈవో జీతం తెలిసి యూజర్లు షాక్‌! దీంతో ఎలా బతుకుతున్నారు సార్‌?

27 Feb, 2023 15:16 IST|Sakshi

వివిధ కంపెనీల సీఈవోలు ఎంతెంత జీతాలు తీసుకుంటున్నారు అనే దానిపై జనానికి ఈ మధ్య ఆసక్తి పెరిగింది. కోట్లలో జీతాలు తీసుకుంటున్న సీఈవో గురించి వింటున్నాం. అయితే దానికి భిన్నంగా అతి తక్కువ వేతనం పొందుతున్న ఈ సీఈవో గురించి తెలుసుకోవాల్సిందే. కునాల్‌షా... క్రెడ్‌(CRED) అనే ఫిన్‌టెక్‌ కంపెనీ సీఈవో. ఆయన తీసుకుంటున్న నెలవారీ జీతం రూ.15వేలు.

 (చదవండి : నోకియా కొత్త లోగో చూశారా?...్ల రియాక్షన్స్‌ మాత్రం..!)

కునాల్‌ షా ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో 'ఆస్క్ మి ఎనీథింగ్' సెషన్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా కంపెనీ సీఈవోగా తాను ఎంత జీతం తీసుకుంటున్నది తెలియజేశారు. ఆయన చెప్పిన జీతాన్ని విని ఆశ్చర్యపోయిన ఓ యూజర్‌.. ఇంత తక్కువ జీతంలో ఎలా బతుకుతున్నారు సార్‌ అంటూ ప్రశ్నించారు. దీనికి సమాధానం చెప్తూ.. కంపెనీ లాభదాయకంగా మారే వరకు తాను ఎక్కువ మొత్తంలో జీతం తీసుకోకూడదనుకున్నానని, అందుకే నెలకు కేవలం రూ. 15 వేలు జీతం తీసుకుంటున్నట్లు షా వివరించారు. తన మునుపటి కంపెనీ ఫ్రీచార్జ్‌ను విక్రయించగా వచ్చిన డబ్బుతో బతుకుతున్నానని ఆయన పేర్కొన్నారు.

(ఇదీ చదవండి: భారత్‌లో మైక్రోసాఫ్ట్‌ సీక్రెట్‌ టెస్టింగ్‌! కోడ్‌నేమ్‌ ఏంటో తెలుసా?)

ప్రారంభంలో ఇలా తక్కువ జీతం తీసుకున్నట్లు చెప్పిన సీఈవోలు చాలా మందే ఉన్నారు. 2013లో జుకర్‌బర్గ్ కేవలం 1 డాలర్‌ వార్షిక వేతనం తీసుకుని ఫేస్‌బుక్‌లో అతి తక్కువ వేతనం పొందే ఉద్యోగిగా నిలిచారు. కాకపోతే బోనస్‌లు, స్టాక్ అవార్డుల రూపంలో పరిహారం అందుకున్నారు. టెస్లా, స్పేస్‌ఎక్స్ సీఈవో ఎలాన్ మస్క్, ట్విటర్ మాజీ సీఈఓ జాక్ డోర్సేలు కూడా తాము సంవత్సరానికి 1 డాలర్‌ జీతం మాత్రమే తీసుకున్నామని అప్పట్లో చెప్పారు.

(ఇదీ చదవండి: Google: ఉద్యోగులకే కాదు.. రోబోలకూ లేఆఫ్‌!)

మరిన్ని వార్తలు