క్రెడిట్ స్కోరు పెంచుకోవాలా?.. అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోవాలి!

25 Oct, 2022 07:39 IST|Sakshi

ప్రస్తుత రోజుల్లో అవసరాల కోసం ప్రజలు రుణాలు తీసుకోవడం తప్పనిసరిగా మారింది. అయితే బ్యాంకులు ఈ విషయంలో ముఖ్యంగా క్రెడిట్ స్కోరును పరిశీలిస్తాయి. అయితే, రుణం తీసుకోవాలనుకున్న చాలామంది ఈ క్రెడిట్ స్కోర్ విషయాన్ని పెద్దగా పట్టించుకోరు. కార్డు బిల్లులను సరైన సమయానికి చెల్లించకపోయినా, క్రెడిట్ కార్డు పరిమితిని ఎక్కువసార్లు గరిష్ఠంగా వాడుకున్నా.. ఇలాంటి పనులు మన క్రెడిట్ స్కోరుపై ప్రభావం పడుతుంది. దీని ద్వారా లోన్‌లు రాకపోగా ఒక్కోసారి తిర​స్కరణకు గురయ్యే అవకాశం కూడా ఉంది. అందుకే మీ క్రెడిట్‌ స్కోరు పెంచుకోవాలంటే ఈ విషయాలు తెలుసుకోవడం ఉత్తమం.

పాత కార్డులతో ఇలా స్కోరు పెంచుకోవచ్చు..
మీరు పాత క్రెడిట్ కార్డ్‌లను ఉపయోగిస్తుంటే, మీ బిల్లులను పూర్తిగా సమయానికి చెల్లిస్తూ ఉండాలి. ఈ ప్రక్రియ దీర్ఘకాలంగా కొనసాగిస్తూ ఉండాలి.  దీని ద్వారా చాలం కాలంగా వాడుకలో కార్డ్‌ ఉండడం, దీంతో పాటు సమయానికి చెల్లింపులు కారణంగా అది మీకు మెరుగైన క్రెడిట్‌ స్కోరును అందిస్తుంది. అందుకే క్తొత కార్డ్‌ల కంటే పాత కార్డులతో స్కోరును సులభంగా పెంచుకోవచ్చు.

పరిమితికి మించి వాడకండి
మీ క్రెడిట్ వినియోగ నిష్పత్తి కూడా మీ క్రెడిట్ స్కోర్‌పై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుంది. కస్టమర్లకు కేటాయించిన పరిమితి ప్రకారం క్రెడిట్ కార్డు వినియోగం ఉండాలి. ఈ క్రమంలో కార్డ్‌ వాడకం లిమిట్‌ దాటకుండా చూసుకోవాలి. అది మీ క్రెడిట్ స్కోర్‌కు పెంచుతుంది. కానీ కార్డులో ఉన్న మొత్తం నగదుని ఉపయోగించడంతో ద్వారా క్రెడిట్ స్కోర్‌పై ప్రతికూల ప్రభావం చూపుతుంది.

లోన్‌ తీసుకుంటే.. ఇలా చేయండి
రుణం తీసుకున్నప్పుడు, తిరిగి చెల్లింపు కోసం కాల వ్యవధిని ఎక్కువ ఉండేలా చూసుకోండి. దీంతో మీ ఈఎంఐ(EMI) చెల్లింపు నగదు తక్కువగా ఉంటుంది. తద్వారా మీరు సమయానికి చెల్లింపులు చేసే వీలు ఉంటుంది. ఇది క్రెడిట్ స్కోర్‌ను పెంచుతుంది. 

రుణ విచారణల్లో జాగ్రత్త
మీరు బ్యాంకుల్లో లోన్ల కోసం ప్రయత్నిస్తే, అవి మీ ప్రొఫైల్ గురించి క్రెడిట్ స్కోరు అందించే సంస్థల వద్ద విచారణలు మొదలుపెడతాయి. ఇక్కడ గమనించాల్సి విషయం ఏంటంటే.. కొందరు అవసరం లేకపోయినా ఎక్కువ క్రెడిట్ కార్డులు లేదా వివిధ బ్యాంకుల్లో రుణాల కోసం ప్రయత్నిస్తుంటారు. అది క్రెడిట్ స్కోరుపై రుణాత్మక ప్రభావం చూపుతుంది. అంతేకాకుండా ఎక్కువ సార్లు రుణ విచారణలు చేసినా, అది కూడా వ్యతిరేక ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈ క్రమంలో కొన్నిసార్లు రుణదరఖాస్తు తిరస్కరణకు గరవుతుంటాయి. ఇది మీరు క్రెడిట్‌ స్కోరు మీద ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది.

చదవండి: యూకే నూతన ప్రధానిపై ఆనంద్‌ మహీంద్రా ప్రశంసల జల్లు

మరిన్ని వార్తలు