యూపీఐకి క్రెడిట్‌ కార్డుల అనుసంధానం.. ఫస్ట్‌ టైమ్‌!

17 Feb, 2023 08:06 IST|Sakshi

ముంబై: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ రూపే క్రెడిట్‌ కార్డులను యూపీఐతో అనుసంధానం చేసుకునే సదుపాయాన్ని తీసుకొచ్చింది. ఇంతకుముందు వరకు యూపీఐకి కేవలం బ్యాంక్‌ సేవింగ్స్‌ ఖాతాలను లింక్‌ చేసుకుని చెల్లింపులు చేసుకోవాల్సి వచ్చేది. ఆర్‌బీఐ క్రెడిట్‌ కార్డుల లింకింగ్‌ కూడా అనుమతించడంతో పరిశ్రమలో ఈ మేరకు మార్పులు చోటు చేసుకుంటున్నాయి.

‘‘ఇక నుంచి హెచ్‌డీఎఫ్‌సీ బ్యంక్‌ రూపే క్రెడిట్‌ కార్డులను ప్రముఖ యూపీఐ ప్లాట్‌ఫామ్‌లపై అనుసంధానించుకుని, వినియోగించుకోవచ్చు’’ అని హెచ్‌డీఎఫ్‌సీ బ్యంక్‌ ప్రకటించింది. ఈ నిర్ణయంతో కస్టమర్లకు డిజిటల్‌ చెల్లింపులు మరింత సౌకర్యవంతంగా మారతాయని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ పేమెంట్స్‌ విభాగం హెడ్‌ పరాగ్‌రావు తెలిపారు.

యూపీఐపై రూపే క్రెడిట్‌ కార్డ్‌ అనుసంధానం నిజంగా పరిశ్రమ రూపురేఖలను మారుస్తుందని భావిస్తున్నట్టు నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌పీసీఐ) సీవోవో ప్రవీణ్‌ రాయ్‌ అభిప్రాయం వ్యక్తం చేశారు.

(ఇదీ చదవండి: వడ్డీ రేట్ల పెంపు జాబితాలోకి మరో రెండు బ్యాంకులు)

మరిన్ని వార్తలు