డిస్నీ స్టార్‌లో క్రికెట్‌ వరల్డ్‌ కప్‌ స్పాన్సర్‌గా మహీంద్రా 

6 Sep, 2023 12:54 IST|Sakshi

న్యూఢిల్లీ:  డిస్నీప్లస్‌ హాట్‌స్టార్‌లో ఐసీసీ క్రికెట్‌ వరల్డ్‌ కప్‌ మ్యాచ్‌ల ప్రసారానికి అసోసియేట్‌ స్పాన్సర్‌గా వ్యవహరించనున్నట్లు ఆటోమేజర్  మహీంద్రా అండ్‌ మహీంద్రా (ఎంఅండ్‌ఎం) ఒక ప్రకటనలో  తెలిపింది. కీలక టార్గెట్‌ మార్కెట్లలోని వినియోగదారుల దృష్టిలో పడేందుకు ఇది ఉపయోగపడగలదని సంస్థ వివరించింది.

 వచ్చే నెలలో ప్రారంభం కానున్న  ఐసీసీ  క్రికెట్ ప్రపంచ కప్ కోసం మహీంద్రా  ఈ కీలక నిర్ణయం  తీసుకుంది. తమ ఎస్‌యూవీలు, ట్రాక్టర్‌ బ్రాండ్లకు..భారతీయ క్రికెట్‌ స్ఫూర్తికి మధ్య పటిష్టమైన అనుబంధం ఉందని సంస్థ ఈడీ రాజేశ్‌ జెజూరికర్‌ చెప్పారు. అక్టోబర్‌ 5 నుంచి వరల్డ్‌ కప్‌ ప్రారంభం కానుంది. నవంబర్‌ 19న ఫైనల్‌ మ్యాచ్‌ ఉంటుంది.  

మరిన్ని వార్తలు