Cross BorderTrade: డాలర్‌తో పనిలేకుండా రూపాయితో! 

30 Nov, 2022 15:24 IST|Sakshi

 డిసెంబరు 5న బ్యాంకులతో ఆర్థిక శాఖ సమావేశం 

న్యూఢిల్లీ: సీమాంతర వాణిజ్యాన్ని డాలర్‌కు బదులు రూపాయి మారకంలో నిర్వహించే మార్గాలపై కేంద్ర ఆర్థిక శాఖ దృష్టి సారించింది. యూఎస్ డాలర్‌కు బదులుగా రూపాయిలో సరిహద్దు వాణిజ్యాన్ని ప్రోత్సహించే మార్గాలను చర్చించేందుకు  డిసెంబరు నెల 5న బ్యాంకుల చీఫ్‌లతో చర్చించనుంది. (ఎన్డీటీవీ: ప్రణయ్ రాయ్, రాధిక గుడ్‌బై, కేటీఆర్‌ రియాక్షన్‌)

ప్రభుత్వరంగ బ్యాంకులు, ఆరు అగ్రగామి ప్రైవేటు బ్యాంకుల సీఈవోలను సమావేశానికి ఆహ్వానించినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. విదేశాంగ శాఖ, వాణిజ్య శాఖకు చెందిన సీనియర్‌ అధికారులు, ఇతర భాగస్వాములు సైతం ఈ సమావేశంలో పాల్గొననున్నట్టు తెలిపాయి. ఆర్థిక సేవల కార్యదర్శి వివేక్‌ జోషి ఈ సమావేశానికి అధ్యక్షత వహించనున్నారు.  (ఇండియన్‌ ఎకానమీకి వచ్చే పదేళ్లు అద్భుతం: నందన్‌ నీలేకని)

కంపెనీల కొనుగోళ్ల నిబంధనల సమీక్ష  సెబీ  అత్యున్నత స్థాయి కమిటీ
కంపెనీల కొనుగోళ్ల నిబంధనలను సులభతరం చేయడానికి, అంతర్జాతీయ విధానాలకు అనుగుణంగా మార్చేందుకు వీలుగా సెబీ ఓ అత్యున్నత స్థాయి కమిటీని నియమించింది. న్యాయస్థానాల గత తీర్పుల కోణంలో ప్రస్తుత నిబంధనలను సమీక్షించనున్నారు. 20 మంది సభ్యుల కమిటీకి పంజాబ్‌ అండ్‌ హర్యానా హైకోర్ట్‌ మాజీ చీఫ్‌ జస్టిస్‌ షివాక్స్‌ జల్‌ వాజిఫ్‌దార్‌ నేతృత్వం వహించనున్నారు. సెబీ, బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈ, న్యాయ సేవల సంస్థల సభ్యులు ఈ కమిటీలో భాగంగా ఉంటారు. గణనీయ మొత్తంలో షేర్ల కొనుగోలు లేదా కంపెనీల కొనుగోలు విషయంలో నిబంధనలపై తమ సూచనలు అందించనున్నారు.  

చదవండి: అమెజాన్‌కు ఏమైంది? వారంలో మూడో బిజినెస్‌కు బై..బై..!

మరిన్ని వార్తలు