ఇళ్లు కొనేందుకు ఎగబడ్డారు.. ఒక్కోటి రూ.7 కోట్లు!

24 Feb, 2023 13:31 IST|Sakshi

ఇళ్లు ఉచితంగా ఇస్తే జనం ఎగబడటం చూశాం. కానీ ఒక్కో ఇల్లు రూ.7 కోట్లు పెట్టి మరీ కొనేందుకు ఎగబడ్డారు. ఎంతలా అంటే మూడు రోజుల్లో ఏకంగా 1,137 ఇళ్లు అమ్మడుపోయాయి. దీనికి సంబంధించి ఇళ్లు కొనేందుకు వచ్చిన జనం అంటూ ఓ ఫొటో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

రియల్‌ ఎస్టేట్‌ దిగ్గజం డీఎల్‌ఎఫ్‌ ఆర్బర్‌ పేరుతో గురుగ్రామ్‌లో ఓ కొత్త ప్రాజెక్ట్‌ చేపట్టింది. ఈ లగ్జరీ ప్రాజెక్ట్‌లో ఫ్లాట్‌లను అమ్మకానికి ప్రకటించగా కంపెనీ కార్యాలయానికి జనం తండోపతండాలుగా తరలివచ్చారంటూ జనం కిక్కిరిసి ఉన్న ఓ ఫొటోను వీకెండ్‌ఇన్వెస్టింగ్‌ అనే సంస్థ అధినేత అలోక్‌ జైన్‌ ట్విటర్‌లో షేర్‌ చేశారు. (నెలకు రూ.4 లక్షలు: రెండేళ...కష్టపడితే, కోటి...కానీ..!)

డీఎల్‌ఎఫ్‌ కొత్త ప్రాజెక్ట్‌లో ఒక్కో ఫ్లాట్‌ ధర రూ.7 కోట్లని, మొత్తం 1,137 ఫ్లాట్లు మూడు రోజుల్లోనే అమ్ముడుపోయాయని తనకు డీఎల్‌ఎఫ్‌ బ్రోకర్‌ ఒకరు తెలియజేసినట్లు అలోక్‌ జైన్‌ పేర్కొన్నారు. దీనికి పలువురు ట్విటర్‌ యూజర్లు పలు విధాలుగా స్పందించారు. ఇది ఇన్వెస్టర్లు, బ్రోకర్ల మాయాజాలం అని, అన్నీ వాళ్లే కొనుక్కొని ఉంటారని కామెంట్లు పెట్టారు. అయితే దీన్ని డీఎల్‌ఎఫ్‌ సంస్థ ధ్రువీకరించాల్సి ఉంది.

(ఇదీ చదవండి: UIDAI Factcheck: ఆధార్‌ జిరాక్స్‌లు ఇవ్వకూడదా?)

మరిన్ని వార్తలు