భారత్‌లో భారీ పెట్టుబడులు

17 Jul, 2021 00:42 IST|Sakshi

క్రౌన్‌ వరల్డ్‌వైడ్‌ గ్రూప్‌ వెల్లడి

ముంబై: హాంకాంగ్‌ కేంద్రంగా పనిచేసే లాజిస్టిక్స్‌ సంస్థ క్రౌన్‌ వరల్డ్‌వైడ్‌ గ్రూప్‌ భారత్‌లో 30 మిలియన్‌ డాలర్లు (సుమారు రూ. 223 కోట్లు) ఇన్వెస్ట్‌ చేయనున్నట్లు వెల్లడించింది. భారత్‌లో తమ కార్యకలాపాలు ప్రారంభించి 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కంపెనీ ఈ విషయం వెల్లడించింది. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా తమ సర్వీసులను అందించేందుకు డిజిటల్‌ సామర్థ్యాలను పెంచుకుంటున్నట్లు క్రౌన్‌ పేర్కొంది. 1996లో భారత్‌లో కార్యకలాపాలు ప్రారంభించిన క్రౌన్‌కు హైదరాబాద్‌ సహా చెన్నై, బెంగళూరు, ముంబై, న్యూఢిల్లీ తదితర 11 నగరాల్లో కార్యాలయాలు ఉన్నాయి. 

>
మరిన్ని వార్తలు