పడవలో మూడు ముళ్లు, ఏడు అడుగులు

15 Jun, 2021 19:43 IST|Sakshi

క్రూయిజ్‌ వెడ్డింగ్‌కి పెరుగుతున్న డిమాండ్‌

కరోనా ఆంక్షలతో పెళ్లి వేడుకల్లో మార్పులు

ఊరికి దూరంగా ఘనంగా పెళ్లి వేడుకలు

సంపన్న వర్గాల పెళ్లిల్లో కొత్త ట్రెండ్‌ 

వెబ్‌డెస్క్‌ : వివాహ వ్యవస్థకు అత్యంత గౌరవం ఇచ్చే సమాజం మనది. అందుకే పెళ్లికి సంబంధించిన ప్రతీ అంశానికి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. ముఖ్యంగా పెళ్లి వేడుకలు నిర్వహించడంపై ఎంతో దృష్టి పెడతారు. కేపీఎంజీ సంస్థ 2017లో రూపొందించిన నివేదిక ప్రకారం ఇండియాలో పెళ్లి వేడుకలపై ఏడాదికి ముప్పై వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తారని చెప్పింది. పెళ్లిని ఘనంగా నిర్వహించడంలో అమెరికరా తర్వాత స్థానం ఇండియన్లదే. 

న్యూ బిజినెస్‌
అయితే కరోనా తర్వాత పెళ్లి వేడుకల్లో మార్పులు వస్తున్నాయి. ముఖ్యంగా కోవిడ్‌ రూల్స్‌, సోషల్‌ డిస్టెన్సింగ్‌తో స్వంతూరిలో ఘనంగా పెళ్లి నిర్వహించడం కష్టంగా మారింది. డెస్టినేషన్‌ వెడ్డింగ్‌కి ఇంచుమించ ఇవే తిప్పలు ఎదురువుతున్నాయి. ఈ తరుణంలో ఒక్కసారిగా క్రూయిజ్‌ వెడ్డింగ్‌కి డిమాండ్‌ పెరిగింది. రెండేళ్ల క్రితం అక్కడక్కడ మొదలైన ఈ ట్రెండ్‌ ఇప్పుడు తారాస్థాయికి చేరుకుంది. రాబోయే కార్తీక మాసంలో ‍పెళ్లిళ్లలకు సంబంధించి ఇప్పటికే వెయిటింగ్‌ లిస్టు ఉందంటున్నారు క్రూయిజ్‌ వెడ్డింగ్‌ ఈవెంట్‌ నిర్వహకులు. రాబోయే రోజుల్లో ఈ రంగంలో వ్యాపార అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నారు. 
 

చదవండి : Tesla: భారత్‌లో రయ్‌..రయ్‌ : వైరల్‌ వీడియో

మరిన్ని వార్తలు