Cryonics 2: మరణించిన వారి శరీరం, మెదడు డ్యామేజ్ కాకుండా ఉంచగలిగితే..

17 Jul, 2022 15:49 IST|Sakshi

చనిపోయిన మనిషిని బ్రతికించగలమంటున్నాయి కొన్ని పరిశోధనా సంస్థలు. అమెరికా, రష్యా దేశాల దగ్గర మాత్రమే ఈ టెక్నాలజీ ఉందని చెబుతున్నారు. శవాలతో వ్యాపారం చేసే సైంటిఫిక్ సంస్థలకు ఊపిరి పోస్తున్నాయి సైంటిస్టుల మాటలు. జీవి ఏదైనా మరణించిన గంట తర్వాతి నుంచి శిధిలావస్థ మొదలవుతుంది. కాని మంచు ప్రాంతాల్లో చనిపోయిన మనుషులు లేదా జంతువులు కొన్ని సంవత్సరాల తర్వాత కూడా పాడవకుండా కనిపించిన ఉదంతాలు ఉన్నాయి.

అదేవిధంగా మైనస్ 196 సెంటీగ్రేడ్ డిగ్రీల టెంపరేచర్ లో వందేళ్ళయినా మృతుడి శరీరం పాడవకుండా భద్రపరచగల ఏర్పాట్లు చేశాయి అమెరికాలోని రెండు సంస్థలు. అవే ఆల్కర్ లైఫ్ ఎక్స్ టెన్షన్ ఫౌండేషన్, క్రయోనిక్ ఇనిస్టిట్యూట్లు. ఆల్కర్ 1972లో ఏర్పడగా...క్రయోనిక్ ను 1976లో స్థాపించారు.

చదవండి: Cryonics: చనిపోయిన మనిషిని తిరిగి బ్రతికించగలమా?సైన్స్‌ ఏం చేప్తోందంటే!

క్రయోనిక్స్ టెక్నాలజీ అంటే అత్యంత శీతల వాతావరణం సృష్టించి మనిషి శరీరం పాడవకుండా భద్రపరచడమే. మరణించిన వారి శరీరం, మెదడు డ్యామేజ్ కాకుండా ఉంచగలిగితే...వారు ఏ కారణంతో చనిపోయారో..దానికి తగిన చికిత్స అందుబాటులోకి వస్తే...ఆ చికిత్స లేదా సర్జరీ ద్వారా వారిని తిరిగి బ్రతికించగలగడమే క్రయోనిక్స్ ఉపయోగం అని చెబుతున్నారు. ప్రస్తుతానికి ప్రపంచంలో ఇటువంటి టెక్నాలజీ అందుబాటులో లేదు. భవిష్యత్ లో అత్యంత ఉన్నతస్థాయి చికిత్సలు అందుబాటులోకి వస్తే చనిపోయినవారిని తిరిగి బ్రతికించగలమనే నమ్మకంతో ఈ సంస్థలు కోట్ల రూపాయల ఫీజు తీసుకుని మృత శరీరాలను పాడవకుండా భద్రపరుస్తున్నాయి.

ఈ పరిశోధన ఎంత దూరం వచ్చింది? థర్డ్‌ స్టోరీలో చదవండి..

మరిన్ని వార్తలు