Cryonics 3: గుండె కొట్టుకోవడం ఆగిన వెంటనే.. క్రయానిక్స్ ప్రారంభం.. ఎలాగో తెలుసా!

18 Jul, 2022 20:56 IST|Sakshi

మనిషి మరణించగానే, గుండె కొట్టుకోవడం ఆగిపోతుంది. మెదడుకు ఆక్సిజన్ సరఫరా నిలిచిపోవడంతో కొత్త జ్ఞాపకాలు ఉండవు. దీంతో మెదడులోని కణాలు మరణించడం ప్రారంభం అవుతుంది. సరిగ్గా అప్పడే క్రయానిక్స్ టెక్నీషియన్ పని మొదలవుతుంది. ఎప్పుడైతే ఒక వ్యక్తి చట్టబద్ధంగా మరణించాడని ప్రకటిస్తారో, వెంటనే శరీరం పాడవడాన్ని అరికట్టేందుకు శరీరానికి ఐస్ బాత్ చేయిస్తారు. ఆ తర్వాత శరీరంలోని రక్తం మొత్తం తొలగించి, దాని స్థానంలో క్రయో ప్రొటెక్టెంట్ ఏజెంట్లను నింపుతారు.

చదవండి: పార్ట్‌ 1: Cryonics: చనిపోయిన మనిషిని తిరిగి బ్రతికించగలమా?సైన్స్‌ ఏం చేప్తోందంటే!

ఆ తర్వాత శరీరాన్ని ఒక స్టోరేజ్ ట్యాంకులో పెట్టి, ద్రవరూపంలోని నైట్రోజన్ ద్వారా దాని ఉష్ణోగ్రతను మైనస్ 196 డిగ్రీల సెంటీగ్రేడ్‌కు తగ్గిస్తారు. ఒకప్పుడు అనేక జబ్బులకు చికిత్స లేదు. కేన్సర్ వచ్చినా, గుండె పోటు వచ్చినా మరణం తప్ప మార్గాంతరం లేదు. కాని ఇప్పుడు ప్రాణాంతక కేన్సర్ కు కూడా చికిత్స అందుబాటులోకి వచ్చింది. పది నిమిషాల పాటు గుండె కొట్టుకోవడం ఆగిపోయినా కూడా చికిత్సతో తిరిగి బ్రతికిస్తున్నారు. కరోనా వంటి అంటువ్యాధులకు నెలల వ్యవధిలోనే వ్యాక్సిన్ తయారు చేశారు.

నానో టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాక అత్యంత క్లిష్టమైన ఆపరేషన్లు కూడా తేలిగ్గా చేయగలుగుతున్నారు. మొత్తం మీద టెక్నాలజీ పెరిగే కొద్దీ మనిషి ఆయుర్దాయం పెరుగుతోంది. గుండె, కాలేయం, మూత్రపిండాలు వంటి అవయవాలను ఒకరి నుంచి మరొకరికి విజయవంతంగా మారుస్తున్నారు. ఇవన్నీ గంటల వ్యవధిలో జరిగితేనే ఫలితం ఉంటుంది. ఈ కోవలోనే టెక్నాలజీని అభివృద్ధి చేసి మృత శరీరాన్ని వందేళ్ళ వరకు పాడు కాకుండా భద్రపరచగలిగే స్థాయికి చేరారు. .............ఈ పరిశోధన ఎంత దూరం వచ్చింది? నాలుగో భాగంలో చదవండి..

చదవండి: పార్ట్‌ 2: Cryonics 2: మరణించిన వారి శరీరం, మెదడు డ్యామేజ్ కాకుండా ఉంచగలిగితే..

మరిన్ని వార్తలు