Cryonics Part 5: సర్జరీ చేసేటప్పుడు డాక్టర్లు రోగి శరీర ఉష్ణోగ్రతను తగ్గిస్తారు.. ఎందుకో తెలుసా!

20 Jul, 2022 18:34 IST|Sakshi

Cryonics Part 5:
జీవిత కాలంలో సర్వ సుఖాలు అనుభవిస్తున్నా మనిషి ఆశకు అంతులేకుండా పోయింది. అందుకే ఎప్పటికైనా మరణాన్ని జయించాలనుకుంటున్నాడు. వందేళ్ళకైనా సాధ్యమవుతుందని ఆశిస్తున్నాడు. దాని కోసం 50 ఏళ్ళ క్రితమే ఏర్పాట్లు ప్రారంభించాడు. ఎన్నో అసాధ్యాలను సాధ్యం చేసుకుంటున్నాం. చావును జయించలేమా అని తనకు తాను ప్రశ్నించుకుంటున్నాడు. దీనిపై సైంటిస్టులంతా ఏకాభ్రిపాయంతో ఉన్నారా?

మనిషి ఆశాజీవి. సైంటిస్టులు కూడా అంతే. ఈ రోజు సాధ్యం కానిది మరో రోజు సాధ్యమవుతుందని విశ్వసిస్తారు. అంతేగాని సాధ్యం కాదని చెప్పరు. క్రయోనిక్స్ టెక్నాలజీని సమర్థించే శాస్త్రవేత్తలు కూడా ఆశావాదులు. మృత శరీరాన్ని పాడు కానీయకుండా, శరీరంలోని కణజాలం దెబ్బతినకుండా నిర్ధిష్టమైన టెంపరేచర్ లో ఎంతకాలమైనా నిల్వ చేయవచ్చని సైంటిస్టులు చెబుతున్నారు. 50 సంవత్సరాలుగా క్రయోనిక్ టెక్నాలజీ అభివృద్ధి చేస్తున్నారు. ఆల్కర్ సంస్థ స్థాపించి 50 సంవత్సరాలైంది. అప్పటికి ఇప్పటికీ వైద్యరంగం ఎంతగానో అభివృద్ధి అయింది కదా అని సంస్థలోని సైంటిస్టులు అంటున్నారు. వందేళ్ళ క్రితం గుండె ఆగితే మరణించినట్లే..కాని ఇప్పుడు నూతన ఆవిష్కరణల ద్వారా పది నిమిషాల పాటు ఆగిన గుండెను కూడా కొట్టుకునేలా చేయగలుగుతున్నారు. అంతర్గత అవయవాలను విజయవంతంగా ఒకరి శరీరం నుంచి మరొకరి శరీరానికి మార్చుతున్నారు. అదేవిధంగా భవిష్యత్ లో చనిపోయినవారి శరీరాలకు అవసరమైన చికిత్స చేసి వారికి తిరిగి ప్రాణం పోయగలమని నమ్ముతున్నట్లు చెబుతున్నారు.

చదవండి: Cryonics 3: గుండె కొట్టుకోవడం ఆగిన వెంటనే.. క్రయానిక్స్ ప్రారంభం.. ఎలాగో తెలుసా!

గుండె లేదా బ్రెయిన్ సర్జరీ చేసేటప్పుడు డాక్టర్లు రోగి శరీర ఉష్ణోగ్రతను తగ్గిస్తారు. సర్జరీ పూర్తయ్యాక తిరిగి సాధారణ ఉష్ణోగ్రతకు తీసుకువస్తారు. శరీరాన్ని మొత్తంగా భద్రపరచడం కూడా ఇలాంటిదే అని సైంటిస్టులు చెబుతున్నారు. అయితే వాస్తవానికి ఈ రెండూ ఒకే విధంగా కనిపించినా, శాస్త్ర పరిభాషలో ఈ రెండూ వేర్వేరు పద్ధతులు. క్రయానిక్స్ విధానం మరణాంతరం శరీరాన్ని భద్రపరచడానికి సంబంధించిన అంశం. క్రయోనిక్స్ టెక్నాలజీని ఇప్పటికే వైద్యానికి సంబంధించి అనేక చోట్ల ఉపయోగిస్తున్నారు. భవిష్యత్ అవసరాల కోసం వీర్యం, అండాలు, చర్మం మొదలైన వాటిని మైనస్ 150 డిగ్రీల సెంటీగ్రేడ్ కన్నా తక్కువ ఉష్ణోగ్రత వద్ద భద్రపరుస్తారు. క్లోనింగ్ ద్వారా పునరుత్పత్తి చేయడం, సరోగసి ద్వారా బిడ్డలకు జన్మనివ్వడం కూడా మానవ మేధాశక్తికి గొప్ప ఉదాహరణలుగా సైంటిస్టులు చెబుతున్నారు. ........................ఐదో భాగంలో చదవండి..

చదవండి: Cryonics 4: చనిపోయినవారి జబ్బులకు చికిత్స చేసి బతికించగలమా?

మరిన్ని వార్తలు