Cryonics: మృత శరీరానికి తిరిగి జీవం పోసే టెక్నాలజీ వస్తుందా?

24 Jul, 2022 18:39 IST|Sakshi

Cryonics Part 8:
అమెరికాలోని బేస్ బాల్ క్రీడాకారుడు టెడ్ విలియమ్స్ 2002లో చనిపోయాడు. అతడు తన తల, శరీరాన్ని వేర్వేరుగా ఆల్కర్ లైఫ్ ఎక్స్ టెన్షన్ ఫౌండేషన్ లో నిల్వ చేసుకున్నాడు. తిరిగి అతని శరీరానికి జీవం పోయగల టెక్నాలజీ అందుబాటులోకి వచ్చినపుడు వైద్యులు విలియమ్స్ తలను శరీరానికి అతికించి బ్రతికించగలరని నమ్మకంతో ఇలా చేశారు. నిప్పును చూసి భయపడే ఆదిమ కాలం నుంచి క్షణంలో ఆకాశానికి ఎగిరిపోయే అత్యంత ఉన్నత స్థాయి టెక్నాలజీ రూపొందించే స్థాయికి మనిషి అభివృద్ధి చెందాడు.

అవసరాల్లో నుంచి అనేక అన్వేషణలు పుట్టుకువచ్చాయి. ఎప్పటికప్పుడు కొత్త విషయాలను కనిపెడుతూనే ఉన్నాడు. మనిషి తన ఉనికికి కారణమైన భూమిని, ప్రకృతినే ధ్వంసం చేసుకుంటున్నాడు. అదే సమయంలో వాటిని కాపాడుకోవడానికి కూడా ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు. కోట్ల సంవత్సరాల క్రితం అంతరించి పోయిన డైనోసార్లకు ప్రాణం వస్తుందా అని వాటి శిలాజ అండాలను పరిశోధిస్తున్నాడు. అంతరించిపోతున్న జీవ జాతుల్ని పరిరక్షించడానికి క్రయోనిక్స్ విధానం ఉపయోగపడుతుందా అని కూడా ఆలోచిస్తున్నాడు. అలాగే చనిపోయిన వారిని బ్రతికించడానికి కూడా తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు. మనిషి ఆశకు అంతం లేదు. నిరంతరం పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. మృత శరీరానికి తిరిగి జీవం పోసే టెక్నాలజీ వస్తుందో రాదో లేదో కాలమే చెబుతుంది.

చదవండి: Cryonics Part7: మృత శరీరాన్ని నిల్వ చేసేందుకు కోటిన్నర ఖర్చు

మరిన్ని వార్తలు